- ప్రజాసమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి హర్షణీయం
- మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ప్రశంసలు
అమరావతి(చైతన్యరథం): యువనేత నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో తిరు గులేని నాయకుడిగా ఎదగడం గర్వంగా ఉందని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొ న్నారు. తన నాయకత్వంలో యువత కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, సమాజ శ్రేయ స్సు కోసం చేపట్టిన సంస్కరణలతో ప్రజల మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. పాదయాత్రలో ప్రజల కష్టాల స్వయంగా చూసిన లోకేష్ వాటిని విస్మరించకుండా సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకుంటూ ప్రజల కన్నీళ్లు తుడుస్తున్నారు.. విదేశాల్లో చిక్కుకు ని ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఆపన్న హస్తం అందించి కాపాడుతున్నారు. పిలిస్తే పలికే ప్రజా నాయకుడిగా లోకేష్ అనతికాలంలోనే పేరు తెచ్చుకోవడం గర్వకా రణంగా ఉందన్నారు. లోకేష్ సారథó్యంలో సభ్యత్వ నమోదులో పార్టీ చరిత్ర తిరగరాసిం ది. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకే ఉన్నారంటే అది లోకేష్ కృషి వల్లేనని పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ అండగా ఉంటున్నారు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పైనే పెట్టుబడులు సాధించారు..విద్యా వ్యవ స్థలో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రక్షాళన చేస్తున్నారని ప్రశంసించారు.