మంగళగిరి: నీటిలో పడిన చీమకు గడ్డిపోచ ఆసరా. అది గడ్డిపోచే కానీ, చీమ ప్రాణాలు కాపాడేది అదే. జీవనసమరంలో పేదలు, దిగువ మధ్యతరగతి జీవులు తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు నానా అగచాట్లు పడుతుంటారు. రోడ్ల పక్కన గోనెసంచులు పరుచుకుని ఆకుకూరలో,కాయగూరలో,పండ్లో అమ్ముతూ జీవనంసాగిస్తారు. మరికొందరు ఒక కట్టెల పొయ్యి పెట్టుకుని టిఫిన్లు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. చెట్ల కింద, దుకాణాల అరుగుల వద్ద ఇస్త్రీ చేసుకుని కాలం గడిపే వాళ్లూవున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకునే పని చేతిలో ఉంది. లేనిదల్లా చిన్నషెల్టర్. తాము ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా, సరుకు పాడవకుండా సౌకర్య వంతంగా పనిచేసుకునేందుకు తోపుడు బండ్లు అనుకూలంగా వుంటాయి. అయితే అవికొనే స్థోమత వీరికి లేదు. అద్దెకి తీసుకుంటే సంపాదించిన దాంట్లో సగం అద్దెకి పోతే ఇంకేమి తినడానికి మిగలదు. రోడ్లపై గతుకుల్లాగే సాగుతున్న వీరిబతుకులకు నారా లోకేష్ రూపంలో ఆసరాదొరికింది. తమకాళ్ల మీద తాము నిలబడుతూ ఉపాధి పొందుతున్న బడుగుజీవులకు తోడ్పాటు అందించాలని లోకేష్ అనుకున్నారు. సొంత సొమ్ముతో తోపుడు బండ్లను చేయించి అందించడం ప్రారంభించారు.
కాయగూరలు అమ్మేందుకు వీలుగా ఒక మోడల్ బండి, ఇస్త్రీ చేసేందుకు అనువైనది మరో మోడల్ బండి,టిఫిన్ బండి ఇలా వారివారి అవసరాలకు అను గుణంగా, నాణ్యంగా బండ్లు చేయించి అందజేయిస్తు న్నారు. ఇప్పటివరకూ పండ్లు,కూరగాయలు, ఇతరత్రా సామాన్లు అమ్మేవాళ్లకు 157తోపుడు బండ్లు అందజే శారు. 14ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. టిఫిన్ స్టాళ్ల కోసం 8బండ్లు, వికలాంగులకి 13 ట్రైసైకిళ్లు నారా లోకేష్ అందజేశారు.ఒకరికి బడ్డీకొట్టు చేయించిఇచ్చా రు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నారా లోకేష్ పంపిణీ చేసిన తోపుడు బండ్లు శుభకరమైన పసుపు రంగుతో స్వాగతంపలుకుతున్నాయి. ఉపాధికాంతులు వెదజల్లుతున్నాయి. లబ్దిదారుల మోముల్లో చిరు నవ్వు లు చిందుతున్నాయి. ఒక బండి చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు నారా లోకేష్‌ని కలిసి విన్నవించినా, మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయం (ఎంఎస్‌ఎస్ భవన్)కి దరఖాస్తు ఇస్తే చాలు. బండి కావాలని అడిగేవారి కులం, మతం, ప్రాంతం చూడరు వారు పేద లైతే చాలు బండిని ఆకర్షణీయంగా తయారు చేసి అందిస్తారు. వివిధరకాల ఉపాధికి సాయంగా నిలిచిన 200 కి పైగా తోపుడు బండ్లు ఆయా కుటుంబాలకి ఆస రాగా నిలుస్తున్నాయి. మరో 400బండ్లు సిద్ధం అవుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అందిస్తున్న ఆసరాతో తమ బతుకు బండి ఇలా సాగుతోందంటున్నారు లబ్ధిదారులు.