• ఆత్మకూరు నియోజకవర్గం గుడిగుంట క్రాస్ వద్ద పత్తిచేలో దిగిన లోకేష్, రైతు కష్టాలు తెలుసుకున్నారు.
• ఈ సందర్భ పత్తిరైతు కరణం రవి తమ ఇబ్బందులను తెలియజేస్తూ… రెండున్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. ఎకరాకు 50వేలు ఖర్చయింది.
• విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఎత్తు పెరిగింది కానీ కాపురాలేదు.
• గులాబీరంగు దోమవల్ల కాపు తగ్గిపోవడమేగాక గుడ్డిపత్తిగా మారి నాణ్యత తగ్గిపోయింది.
• 20 క్వింటాళ్లు రావాల్సింది 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది, క్వింటా 5వేలు పలుకుతోంది.
• నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయాను.
• డ్రిప్ లు లేకపోవడంతో పత్తిసాళ్లకు నీళ్లు పెట్టడం వల్ల గడ్డి ఎక్కువ పడుతోంది.
• కలుపుతీత ఖర్చులు భారీగా పెరిగాయి. మాకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తే ఈ సమస్య ఉండదు.
• సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తిచేసి, నీళ్లివ్వాలి. బోర్లతో తోడుకోవాల్సి వస్తోంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• వ్యవసాయమంత్రి మీ జిల్లా వాడే, ఆయన కోర్టులో పత్రాల చోరీ కేసులో సిబిఐ చుట్టూ తిరుగుతున్నాడు, మిమ్మల్ని పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుంది?
• గతంలో 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించడమేగాక ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం.
• రైతులు ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు అంగీకరించొద్దు. అవి మీ మెడకు ఉరితాడుగా మారతాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతాం.
• డ్రిప్ ఇరిగేషన్ తో పాటు గతంలో రైతులకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.