- గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
- పెనుమూలిలో గ్రంథాలయం ప్రారంభం
మంగళగిరి(చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహా న్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా దేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందరితో కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గుంటూ రు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాసరనేని జశ్వంత్, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.
పెనుమూలిలో గ్రంథాలయం ప్రారంభం
దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మిం చారు. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనా న్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిష త్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని శ్రీ అనిత, పెనుమూలి గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాశీం, గ్రామ సర్పంచ్ కొరిటాల పద్మావతి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నా రు.














