- మీలా దాక్కునే పిల్లికాదు జగన్ రెడ్డీ!
- ఆయనను చూస్తే వైసిపికి వెన్నులో వణుకు
- మా నేతలపై పిచ్చివాగుడు వాగితే తాటతీస్తాం!
- టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ
అమరావతి: పులిలా బయటికొచ్చే లోకేశ్ ఎక్కడ? జనానికి భయపడి పిల్లిలా తాడేపల్లిలో దాక్కొనే జగన్ ఎక్కడ? అని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రశ్నించారు. లోకేశ్ తెగింపు, ధైర్యం, మాటతీరు చూసి వైసీపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయి. లోకేశ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. వైసీపీ తుప్పును తొలగించడానికి వచ్చిన నిప్పు నారా లోకేశ్. నెల్లూరులో ఎవరైనా ఫోర్ ట్వంటీ ఉన్నాడంటే అది కాకాణి గోవర్థన్ రెడ్డే. మరొకరు కాదు. ప్రశాంతంగావున్న నెల్లూరును కాకాణి సర్వ నాశనం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ల గురించి పిచ్చివాగుడు వాగితే తాట తీస్తాం. వైసీపీ నాయకులు ఎదుటివారి గురించి హేళనగా మాట్లాడం మానాలి. వైసీపీకి చుక్కలు చూపించడం ఆరంభమైంది. వైసీపీ నాయకుల తమ తప్పు తెలుసుకొని నష్టం జరిగినవారిని పరామర్శించాల్సిన అవసరముంది. పోలీసుల ప్రొటెక్షన్ లేకుండా జగన్ రోడ్డుపైకి రాగలడా? ఆపదలో ఉన్న ప్రజల కోసం లోకేశ్ దర్జాగా బయటికి వచ్చి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నాడు. అది లోకేశ్ గొప్పతనం. లోకేష్ బాధితుల తరపున ఫైట్ చేస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని గ్రీష్మ పేర్కొన్నారు.