పలాస: యువగళం పాదయాత్రతో టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నివర్గాలకు ఆత్మ బంధువయ్యారని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌతు శిరీష అన్నారు. పలాసలో ఆదివారం జరిగిన లోకేష్ శంఖారావం సభలో ఆమె మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్ల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలతో మమేకమయ్యేందుకు రోజుకు 3 నియోజకవర్గాల్లో లోకేష్ శంఖా రావం పూరిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల ను వేధిస్తున్న పశువుకన్నా హీనమైన వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నారు. కిరాయి గూండా లతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అయిదేళ్లలో పలాసలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? చంద్రబాబు తెచ్చిన డయాలసిస్ సెంటర్‌ను, కిడ్నీ హాస్పటల్‌ను వారు తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కనీసం అక్కడ మూత్రపిండాల వ్యాధి నిపుణులైన డాక్టర్‌ను కూడా నియమించకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో కొండ లన్నింటినీ కరిగించిన ఘనత మంత్రిదే. కేటీ రోడ్డు పూర్తికాలేదు కానీ, ఆయన ఇంటి ముంధు ప్రగతిభవన్ పూర్తయింది. మందస మండలంలో సాగునీటికి ఇబ్బంది లేదంటే అందుకు గతంలో గౌతు శివాజీ చేసిన కృషే కారణం. వరహాలగడ్డ ప్రాజెక్టును పూర్తిచేసింది కూడా టీడీపీనే. 30సంవత్సరాలుగా గౌతు కుటుంబం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేసింది. టీడీపీ చేసిన అభివృద్ధి కళ్లకు స్పష్టంగా కన్పిస్తోంది, రామకృష్ణాపురంలో 2 వేల ఇళ్లు కట్టాం. అభివృద్ధి అంటే పనికిరాని జులాయి వెదవలతో మాపై దుష్ప్రచారం చేయడం కాదు. గత అయిదేళ్లలో వేధింపులే వైసీపీ పాలకులు చేసిన అభివృద్ధి. అర్థరాత్రి జేసీబీలతో ఇళ్లు కూలగొట్టిస్తున్నారు. అయి దేళ్లుగా ఎంత వేధించినా కార్యకర్తలు మా వెన్నంటి ఉన్నారు, వారందరికీ పాదాభి వందనం. వజ్రపుకొత్తూరు, పలాస మున్సి పాలిటీల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్తాయిలో సమస్య పరిష్కరిస్తాం. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. జీడి పిక్కల వ్యాపారులను పోలీసు కేసులతో వేధిస్తు న్నారు, గతంలో జీడిపిక్కలకు రూ.14వేలు ఉన్న రేటు ఇప్పుడు ఏడువేలకు పడిపోయింది. పలాస నియోజకవర్గం నుంచి చాలామంది వలస వెళ్తున్నారు, ఈ ప్రాంత వాసులకు ఆర్మీ పరీక్షలకు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలి. అరబ్ దేశాలకు వెళ్లే స్థానికులు దళారుల చేతి లో మోసపోతున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు చొరవతో చాలామంది స్వగ్రామానికి చేరుతున్నారు. పలాసలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టి విదేశాలకు వెళ్లేవారికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలి. పలాసలో బీసీ స్టడీసర్కి ల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగాలకు శిక్షణ ఇప్పిం చాలి. మత్స్యకారులకు వలలు ఇవ్వలేని చేత గాని మంత్రి ఇక్కడ ఉన్నాడు, అబద్ధాల పత్రి కలు, చానళ్లను పెట్టుకుని శునకానందం పొం దుతున్నాడు. వైసీపీ నేతలకు, తాగుబోతులకు కేంద్రాలుగా ఫిష్ మార్టులు తయారయ్యాయి, మత్స్యకారుల కోసం కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించే పరి శ్రమలను పలాసకు రప్పించాలి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర యువతకు ఆశాకిరణం, రెండునెలల్లో రాబోయే మన ప్రభుత్వంలో యువతకు భరోసా కల్పిస్తాం. తిత్లీ తుఫాన్ సమయంలో మందస వచ్చిన నారా లోకేష్ 12రోజులు ఇక్కడే ఉండి అందించిన సేవలు అనిర్వచనీయమని శిరీష అన్నారు.