- జగన్ రెడ్డి విధ్వంసక పాలనపై యువనేత సమరశంఖం
- ఏడాదిపాటు కొనసాగనున్న యువనేత పాదయాత్ర
- కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా కొనసాగనున్న యాత్ర
- మహిళలు, యువత, రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండా
- పీడిత ప్రజలకు భరోసా.. ప్రజాచైతన్యమే ప్రధాన లక్ష్యం
అమరావతి : తెలుగుదేశం పార్టీ యువకెరటం నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. 2023 జనవరి 27వతేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సుమారు 4వేల కిలోమీటర్ల పొడవున లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ప్రతిరోజు 12 నుంచి 15కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనను ఎండగడుతూ ప్రజాసమస్యలపై గళమెత్తడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. ఏడాది పాటు జనం మధ్యే ఉండే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దమవుతోంది. రాష్ట్రంలో యువత, మహిళలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగుతుంది. దీనికితోడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనతో తరలిపోయన పరిశ్రమలు, జె-ట్యాక్స్, పన్నుల భారంతో జనదజీవనం అస్యవస్థంగా మారిన విధానంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా పాదయాత్ర సాగనుంది. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించేలా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ యాత్ర ముందుకు సాగనుంది. యువనేత పాదయాత్ర ఖరారైందన్న వార్త శుక్రవారం మీడియాలో వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో యువతరానికి ప్రతినిధిగా ఉంటూ అధికారపార్టీ అరాచకాలపై దూకుడుగా ముందుకెళ్తూ పోరాడుతున్న లోకేష్ చేయబోయే పాదయాత్ర… వివిధ కారణాల వల్ల స్తబ్ధుగా ఉన్న కేడర్‌ను యాక్టివేట్ చేయడానికి టానిక్ లా ఉపయోగపడుతుంది. లోకేష్ పాదయాత్ర ముగిసేటప్పటికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలుండటంతో యాత్ర నుంచి నేరుగా ఆయన ఎన్నికల కదనరంగంలోకి వెళ్లే అవకాశాలున్నాయి.