అడవుల్లో స్వేచ్చగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం
గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం
ఎకో టూరిజంతో గిరిజనుల ఉపాధి మెరుగుపరుస్తాం
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చెంచులకు పక్కా ఇళ్లు
చెంచులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
…….
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సంతజూటూరులో చెంచు సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చెంచులకు ప్రత్యేక అటవీ హక్కులు ఉన్నాయి. మీ హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అడవికి వెళ్లి స్వేచ్చగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచు గూడెం లో పక్కా ఇళ్లు, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ , ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. ఐటిడిఏ ద్వారా అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలను చెంచు లకు అందజేస్తాం. గిరిజనలు తయారు చేసే ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ చెయ్యడానికి ప్రత్యేక అవుట్ లెట్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. ఏకో టూరిజం ఏర్పాటు చేసి గిరిజనులు, చెంచులకి ప్రయోజనాలు కలిగేలా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చెంచుగూడెంలను అభివృద్ది చేసే బాధ్యతని నేను తీసుకుంటా అని లోకేష్ హామీ ఇచ్చారు.
చెంచులకు భూములు కేటాయిస్తాం
100 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా చెంచు సోదరులతో సమావేశం అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చెంచుల్లో పోరాట స్ఫూర్తి ఎక్కువ. బ్రిటిష్ వారిపై పోరాడి నల్లమల లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న చరిత్ర చెంచులది. చెంచులు నిజాయితీగా ఉంటారు. సాయం పొందితే మర్చిపోరు. కృతజ్ఞతగా ఉంటారు అని లోకేష్ వెల్లడించారు. చెంచులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చింది టిడిపి. గిరిజనుల మేలు కోసం ఐటిడిఎ ఏర్పాటు చేసింది టిడిపి. చెంచులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.
అరకు కాఫీ కి ప్రంపంచం వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది టిడిపి. ఆర్డిటి లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని చెంచులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతాం. టిడిపి హయాంలో తాండా లో గ్రావిటీ ప్రాజెక్టులు నిర్మించి తాగునీటి సమస్య ను పరిష్కరించాం. చెంచు లకి భూములు కేటాయించి పట్టాలు ఇస్తాం. వ్యవసాయం కోసం బోర్లు వెయ్యడం తో పాటు సోలార్ మోటార్లు బిగిస్తాం, దగ్గర లో ఉన్న చెరువుల ద్వారా పైప్ లైన్ ద్వారా సాగునీరు అందిస్తాం. బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని చెప్పారు.
అటవీ అధికారులు వేధింపులు లేకుండా చేస్తాం
వైసిపి నాయకులు చెంచు లను అవమానించే విధంగా మాట్లాడటం దారుణం. వేధించడం అన్యాయం. ఆఖరికి చెంచుల నిధులు కూడా కొట్టేశాడు జగన్ అని లోకేష్ ఆరోపించారు. టిడిపి హయాంలో గిరిజనుల అభివృద్ధి కోసం 15 వేల కోట్లు ఖర్చు పెట్టాం. టిడిపి వచ్చిన వెంటనే ఐటిడిఏ లను ప్రక్షాళన చేస్తాం. చెంచులు అంతరించి పోయే జాతుల్లో ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మలని ప్రత్యేకంగా పరిగణించి మిమ్మలని కాపాడుకుంటాం.
చెంచు పిల్లల చదువు కోసం ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, చెంచుల నే టీచర్లు గా నియమిస్తాం. చెంచులకు ఫారెస్ట్ అధికారుల వేధింపులు లేకుండా చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాది లోనే చెంచులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. అందరం కలిసి గృహ ప్రవేశం చేద్దాం. చెంచుల్లో ఉన్న బాధ, ఆవేదన నాకు అర్దం అయ్యింది. బ్యాక్ లాగ్ పోస్టులు అన్ని భర్తీ చేసి చెంచులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
యువనేత ఎదుట చెంచుల ఆవేదన
యువనేత ఎదుట పలువురు చెంచులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంకటమ్మ మాట్లాడుతూ జగన్ పాలనలో చెంచు గూడెం లో ప్రత్యేక ఉపాధి హామీ పనులు, పక్కా ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నాం. అడవిలోకి వెళ్ళడానికి అటవీ శాఖ అధికారులతో వేధింపులు ఎదుర్కుంటున్నాం. ఐటిడిఏల ద్వారా చెంచు లకు ఎటువంటి సాయం అందడం లేదని తెలిపింది. వీరన్న మాట్లాడుతూ 42 చెంచు గూడెంలు ఇబ్బంది పడుతున్నాం. మా హక్కుగా ఇవ్వాల్సిన భూములు ఇవ్వడం లేదు. మాకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
వైసిపి ప్రభుత్వం లో మాకు ఏ మేలు జరగకపగా, వేధింపులు ఎక్కువ అయ్యాయి. అడవి మా హక్కు. జగన్ మా హక్కు హరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లింగమ్మ మాట్లాడుతూ బోర్లు లేవు. ఎన్నికల ముందు సాగునీరు కోసం బోర్లు అందిస్తామని అన్నారు. ఇప్పుడు అధికారులను అడిగితే పోయి జగన్ ని అడగమని అంటున్నారు. కనీసం లోన్లు కూడా రావడం లేదు. టెట్ నిబంధన ఉండటం వలన చెంచు లు టీచర్ పోస్టులు పొందలేకపోతున్నారు. గతంలో చెంచులకు టీచర్ పోస్టులు వచ్చేవని చెప్పారు.