అమరావతి: పెద్దలు పెద్దిరెడ్డిది వైన్-మైన్, ల్యాండ్-శాండ్-శాండల్‌వుడ్ దోచుకునేంత పేద్ద బుర్ర, లక్షలకోట్లు బొక్కేంత పేద్ద బొర్రా మీకున్నాయని ఒప్పుకుంటాను.. అటువంటి దోపిడీ బుర్ర నాకు లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఎనర్జీ అసిస్టెంట్లు వారి బాధలు నాతో చెప్పుకున్నారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారి సమస్యలు పరిష్కరించాలని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. అక్రమార్కులైన మీరు వక్రంగా స్పందించారు, అయినా సంతోషం. బాబు హయాంలో ఒక్క జాబూ రాలేదన్న మీరు.. చంద్రబాబు గారి హయాంలో 39,450 పరిశ్రమలు,వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని మీ ప్రభుత్వం శాసనమండలిలో చెప్పిన అంశాల్ని ఖండిస్తున్నారంటే మీరెంతో బుర్రతక్కువ పెద్దలో అర్థమవుతోంది.
విద్యుత్ ప్రమాదాల్లోనే 89 మంది ఎనర్జీ అసిస్టెంట్లు చనిపోతే, వ్యక్తిగత అశ్రద్ధ వల్ల చనిపోయారంటూ ఒక మంత్రిగా చెప్పడం..బాబాయ్‌ని గొడ్డలితో వేసేసి గుండెపోటు అన్నట్టే ఉంది. ఇంధన ఎక్స్చేంజిల నుంచి విద్యుత్ కొనుగోలు-అమ్మకాలు చేయకుండా ఏపీ డిస్కంలపై కేంద్రం నిషేధం విధించిన రోజునే..మీ పాలనలో ఏపీ విద్యుత్‌రంగం ఏ గ్రేడులో ఉందని చెప్పుకోవడం మీ ఫేకూ పాలనకే సాధ్యం. ఎనర్జీ అసిస్టెంట్లను సచివాలయాల్లో నియమించి, విద్యుత్‌శాఖలో వాడుకుంటూ, వారి ప్రాణాలు పోతున్నాయి ఆదుకోండి అని నేను కోరితే…వారిని కించపరిచానంటూ ప్రకటన విడుదల చేయడం చూస్తే మీరు ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది. తెలుగుదేశం మీద, చంద్రబాబుపైనా, నా మీద ఏడవడం ఆపి..వేలాది మంది ఉద్యోగుల సమస్‌టల పరిష్కారంపై దృష్టి పెట్టండి. కూర్చుంటే లేవలేవు..లేస్తే కూర్చోలేని స్థితిలో బుర్ర కరాబు చేసుకుని నా జ్ఞానం గురించి మాట్లాడుతూ నీ అజ్ఞానాన్ని బయటపెట్టుకోవద్దని పెద్దిరెడ్డికి హితవు పలికారు.
అమాయకులను బలిగొంటున్న ఇసుక మాఫియా
జగన్‌రెడ్డి ఇసుక మాఫియా అమాయకుల్ని బలి తీసుకుంటోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకి అడ్డుపడ్డాడని దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేసింది వైసిపి ప్రభుత్వం. ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లపల్లెలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించి అడ్డుకున్నందుకే యువకుడు కిషన్ ని ఇసుక మాఫియా హత్య చేసిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి కిషన్ ని హత్య చేసిన ఇసుక మాఫియా, దాని వెనుక ఉన్న వైసిపి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాలని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.