అల్లూరు వద్ద మిడుతూరు ఎత్తిపోతల పధకానికి హామీ ఇస్తూ శిలాఫలకం
20వేల ఎకరాలకు సాగునీరు, 60వేలమందికి త్రాగునీరు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర బుధవారం మరో మజిలీ చేరుకుంది. పాదయాత్ర బుధవారం నాటికి 1200 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది.ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తూ శిలాఫలకం వేస్తున్న విషయం తెలిసిందే.
ఆ క్రమంలోనే బుధవారం పాదయాత్ర 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిడుతూరు ఎత్తిపోతలపథకానికి శిలాఫలకం వేశారు.
నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నది. ఈ సందర్భంగా నారా లోకేష్హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికిశిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు,మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60వేలమంది ప్రజలకు తాగునీరు అందుతుంది.