- వైసీపీ నేతల కార్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించిన లోకేష్
మంగళగిరి, చైతన్యరథం: ఎన్నికల ప్రచారంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్ధి నారా లోకేష్ కాన్వాయ్‌ను ఆదివారం నాడు పోలీసు అధికారులు రెండు సార్లు ఆపి తనిఖీ చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన మూడురోజుల్లో లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం ఇది నాలుగోసారి. తనిఖీల కోసం పోలీసులకు పూర్తిగా సహకరించిన లోకేష్ వైసీపీ నేతల కార్లను ఆపి ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. ఒక్క టీడీపీ నేతల కార్లను మాత్రమే ఆపి తనిఖీ చేయమని పై నుండి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. తనిఖీలు చేసిన పోలీసులు ఎన్నికల కోడ్‌కు విరుద్దంగా ఏమీ లేదని నిర్దారించారు. లోకేష్ ప్రచారం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే సాగుతుందని పోలీసులు తెలిపారు