- నియోజకవర్గంలో 1050 జంటలకి పెళ్లికానుకలు అందజేత
- వధూవరులకి పట్టువస్త్రాలతోపాటు అభినందన సందేశం పంపుతోన్న నారా లోకేష్
మంగళగిరి: శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఆకారం దాల్చనుంది కొత్త జీవితం. ఆ పెళ్లి పుస్తకంలో ఓ పేజీగా నారా లోకేష్ ఆత్మీయంగా, అభినందన సందే శాలతో పంపిన పెళ్లి కానుక చోటు దక్కించుకుంటుంది. ఆ కానుకని డబ్బుతో కొలవలేం. పుట్టింటి నుంచి వచ్చిన అనుబంధమంత విలువైనది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ప్రజలు తమ ఇంట్లో వివాహాది శుభకార్యాలకి నారా లోకేష్ కార్యా లయానికి ఆహ్వానాలు పంపుతారు. వచ్చిన ప్రతీ ఆహ్వాన పత్రికని సిబ్బంది క్రమపద్ధతిలో తేదీ, సమయం, స్థలం వివరాల వారీగా నమోదుచేస్తారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం కార్య కర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా, ఎమ్మెల్సీగా నిత్యమూ బిజీగా వుండే నారా లోకేష్ తన ప్రతినిధులని ఆహ్వానం అందే ప్రతీవివాహానికి పంపుతారు. వధువు తరపు వారై నా, వరుడి తరపువారైనా పెళ్లికి చెబితే.. వధూవరు లిద్దరికీ పట్టు వస్త్రాలు మంగళగిరి టిడిపి కార్యాలయం నుంచి పంపించడం నారా లోకేష్ ఆన వాయితీగా పాటి స్తున్నారు. ఏ గ్రామంలో వివాహం అవుతుందో ఆ గ్రామ టీడీపీ నేత, లేదా పెద్ద.. పార్టీ ముఖ్యనాయకులు కొందరు వివాహానికి హాజరు అవుతారు. నారా లోకేష్ వధూవరు లని ఆశీర్వదిస్తూ పంపిన సందేశం, పెళ్లికొడుకుకి పట్టు పంచె, పెళ్లి కుమార్తెకి పట్టుచీరతో కూడిన పెళ్లి కానుకని అందజేసి ఆశీర్వదించి వస్తారు. ఇప్పటివరకూ నియోజక వర్గంలో కుల,మతాలకు అతీతంగా 1050 వివాహాలకు నారా లోకేష్ పంపిన పెళ్లి కానుకలని అందజేశారు. ఆ పట్టు బట్టలు డబ్బులలో లెక్కిస్తే పెద్దగా విలువైనవిగా అనిపించ కపోవచ్చు. నారా లోకేష్ అందించే బహుమతిగా స్వీకరిస్తున్నారు.