• వెంకటగిరి నియోజకవర్గం మాదన్నగారిపల్లి, చింతలపాలెం, వెంకట్రామరాజుపేట, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• 1990లో కలువాయి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసే క్రమంలో మా గ్రామాలకు చెందిన 542ఎకరాలు నీటమునిగాయి.
• అప్పటినుంచి ఇప్పటివరకు పరిహారం కోసం కోర్టుల్లో పోరాడి అలసిపోయాం, ఇప్పటివరకు ఒక్కపైసా ఇవ్వలేదు.
• తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మా గ్రామాల రైతులకు హామీ ఇచ్చి ముఖం చాటేశారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాజకీయ లబ్ధికోసం ఇన్ స్టంట్ గా హామీలిచ్చా అవసరం తీరాక పట్టించుకోకపోవడం ముఖ్యమంత్రి జగన్ కు అలవాటుగా మారింది.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు నిర్మించకపోగా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం దారుణం.
• కలువాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారం విషయమై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం.
• ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేం అధికారంలోకి వచ్చాక పరిహారం అందిస్తాం.