.ల్యాబ్ పంపించకుండానే ఫేక్ అని ఎలా నిర్థారిస్తారు?
.ఆ వీడియో ఫేకో… రియలో ప్రజలే తేల్చుతారు
.ఎస్పీ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు
అమరావతి: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోను ఒరిజనల్ అని నిర్థారిం చలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండిరచారు. ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఫోరెన్సిన్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలన్నారు. అసలు ఈ కేసులో మాధవ్ ఒరిజినల్ వీడియో ఉందా? లేదో చెప్పలేని స్థితిలో రాష్ట్రంలోని పోలీస్ యాత్రంగం ఉండటం సిగ్గుచేటున్నారు. మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో… రియలో ప్రజలే తేలుస్తారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
మాధవ్‌ను తప్పించడానికే ఎస్పీ అడ్డగోలు అబద్ధాలు : అచ్చెన్నాయుడు
వైసీపీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజాన్ని దాచి గోరంట్ల మాధవ్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వర్డ్ చేసిన వీడియోలే ఉన్నాయని ఒరిజినల్ వీడియో దొరికితేనే తాము నిగ్గుతేల్చగలమని ఎస్పీ స్థాయి అధికారి చెప్పడం దుర్మార్గమన్నారు. ఏపీ పోలీసులు తలచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం అంత కష్టమేమి కాదని, నిజాన్ని తేల్చడం కష్టమని పోలీసులు భావిస్తే కేసును సీబీఐకి అప్పగించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
మాధవ్‌కు క్లీన్‌చీట్ ఇచ్చే అధికారం ఏస్పీకి ఎక్కడది? : నక్కా ఆనందబాబు
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ వస్తే కాని నిగ్గుతేల్చమని ఎస్పీ పక్కీరప్ప మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండానే ఎస్పీ క్లిన్‌చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రాష్ట్రంలో నిజం నిగ్గుతేల్చే అధికారం పోలీసులకు లేదు. రెండు రోజుల క్రితమే సజ్జల చెప్పిందే ఎస్పీ చెప్పడం ఊహించిందే. నాలుగు గోడల మధ్య జరిగింది రాద్ధాంతం చేస్తోందని సజ్జల బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. వీడియో భయటకు వచ్చి వారం అవుతున్నా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఫేక్ వీడియోనా ఒరిజినలా అనేది తేల్చలేకపోతున్నారు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబ్స్ కో వీడియోని పంపిస్తే గాని వాస్తవం తేలుతుంది. ఎంపీ ఫోన్ సీజ్ చేయకుండా, ఫోరెన్సిక్‌కి పంపకుండా ఎస్పీ ఎంపీని వెనకేసురావడం మంచిది కాదు. మాధవ్ వ్యవహారం రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానం. ఎస్పీ ప్రకటనతో క్లిన్ చిట్ ఇచ్చినట్లుగా ఎంపీ మాట్లాడడం విచిత్రంగా ఉంది. చంద్రబాబు, లోకేశ్‌పై పరుష పదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో కొట్టివేసిన ఓటుకు నోటు కేసును పట్టుకు వెళాడుతున్నారు. గుడ్డలూడదీసి తిరిగి సిగ్గులేకుండా బూతులు మాట్లాడం సమాజం తలదించుకునేలా ఉంది. ఐటీడీపీ, టీడీపీ నేతలను ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని నక్కా ఆనందబాబు హెచ్చరించారు. ఎంపీకి క్లిన్ చిట్ ఇవ్వడానికి ఎస్పీకి అర్హత లేదు. వీడియో బయటకు వచ్చిన రోజే ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎంపీ ప్రకటిస్తే.. నేటీకి ఫిర్యాదు అందలేదని ఎస్పీ ప్రకటించారు. చిన్న చిన్న అంశాల్లో టీడీపీ కార్యకర్తల ఫోన్లు సీజ్ చేసి హింసిచ్చారు. ఇంత పెద్ద వ్యవహారంలో ఇప్పటికీ ఎంపీ ఫోన్ సీజ్ చేయకుండా పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరించారని ఆనందబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు విమర్శించే స్థాయి మాధవ్‌కు లేదు: టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామరాజు
చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీచపు ఎంపీ గోరంట్ల మాధవ్‌కు లేదని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కుల రఘురామరాజు వ్యాఖ్యానించారు. గుడ్డలూడదీసుకుని తిరిగిన నీకు.. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్ కాలిగోటికి కూడా మాధవ్ సరిపోరని, నీచపు భాషతో సిగ్గులేకుండా మాట్లాడడం దుర్మార్గమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు.
కేసు నీరుగార్చేలా ఎస్పీ ప్రకటన : గుంటుపల్లి శ్రీదేవి
గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించకుండానే అనంతపురం జిల్లా ఎస్పీ అది ఫేక్ వీడియో అని ఏవిధంగా ప్రకటిస్తారని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవీ ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ కేసును నీరుగార్చేలా ఎస్పీ ప్రకటన ఉందన్నారు. బాధ్యత కలిగిన అధికారి ఈ విధంగా మాట్లాడటం సరైందికాదన్నారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికంటే.. ఆ వీడియో ఒరిజినలా? కాదా? అనే విషయంపై దృష్టిసారిస్తే మంచిదన్నారు. గత ఐదు రోజులుగా కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లుగా ప్రభుత్వ తీరుందన్నారు. హోంమంత్రి ప్రకటనకు, ఎస్పీ ప్రకటనలకు పొంతన లేకుండా ఉందని, గోరంట్ల మాధవ్ వ్యవహారం కూడా వివేకా మర్డర్ కేసులా మరుగునపడేలా చేస్తున్నారని అన్నారు.