- 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా సత్యం సమాధి!
- దొంగ ` పోలీసులు ఏకమై నిజానికి పాతర
- ఉన్మాదానికి తలొగ్గిన మూడుసింహాలు
- ఫకీరప్ప మాటలకు నివ్వెరపోయిన మహిళాలోకం
- జగన్ రెడ్డి రాక్షస రాజ్యంలో మహిళాభద్రత మిథ్యే
- మహిళల మాన,ప్రాణాలకు ఇక దేవుడే దిక్కు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
యావత్ మహిళాలోకాన్ని విస్మయానికి, విభ్రాంతికి గురిచేస్తూ గోరంట్ల మాధవ్ అనే మానవమృగం చేసిన వికృత చేష్టలకు సభ్యసమాజం సిగ్గుతో తలదించు కుంటుంటే.. సిగ్గు,లజ్జా వదిలేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఆ కామాంధుడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అసాంఘిక చర్యతో నిలువెత్తు బురదలో కూరుకుపోయిన మదపిచ్చిగాడు నరరూప రాక్షసుడు జగన్ రెడ్డి అండతో వికటాట్టహాసం చేస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మహిళాలోకం నిశ్చేష్టమైంది. రాక్షసరాజ్యంలో ఇక మహిళల రక్షణ మిథ్యేనని తేలిపోయింది. వీడియో సాక్షిగా అడ్డగోలుగా దొరికిపోయిన మదపిచ్చిగాడు మాధవ్ జగన్ రెడ్డి అండతో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు చూశాక ఇక రాష్ట్రంలో మహిళలను ఆ దేవుడు తప్ప మరెవరూ రక్షించలేరని తేటతెల్లమైంది.
ఎంపి మాధవ్ చేసిన అసహ్యమైన పనిని కప్పిపుచ్చేందుకు జగన్ రెడ్డి గత వారంరోజులుగా చేయని ప్రయత్నమంటూ లేదు. మదపిచ్చి ఎంపిపై చర్యల విషయంలో జాప్యం జరుగుతున్నప్పుడే జగన్ పన్నాగం యావత్ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అన్ని విషయాల్లో తెలుగు దేశంపై తప్పును నెట్టేసినట్లే ఇక్కడా ప్రయత్నం చేశారు. కానీ వాస్తవమేమిటో ప్రజలందరికీ తెలిసిపోయింది. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పిన మాటల్లోనే వైరుధ్యం కనిపిస్తోంది.ఎస్పీ ఫకీరప్ప ఒకవైపు ఆ వీడియో ఒరిజినల్ కాదంటూనే.. అంతలోనే ఒరిజినల్ వీడియో వస్తే తప్ప వాస్తవం తేల్చలేమంటాడు. మాధవ్ న్యూడ్ వీడియోకు సంబంధించి ఎవరూ కేసు పెట్టలేదంటూ ఎస్పీ ఫకీరప్ప విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలో యావత్ ఐపిఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఏదేని శవం దొరికినపుడు ఎవరూ కేసు పెట్టలేదని వదిలేస్తారా అన్న ప్రశ్నకు ఆయననుంచి సమాధానం లేదు. ఫకీరప్ప నిఖార్సయిన పోలీసు అధికారే అయి ఉంటే వీడియో ఎక్కడ నుంచి బయటకు వచ్చింది అనేది ముఖ్యం కాదు… అది ఎంపీనా కాదా అనేది తేల్చి ఉండేవారు.
ఒక ఎంపి అడ్డంగా వీడియోలో దొరికితే ఐపిఎస్ అధికారి ఇంత చేతగానివాడిలా మాట్లాడటం చూసి మహిళాలోకం నివ్వెరపోయింది. వీడియోపై ఎంపి అభిమాని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామని ఎస్పీ చెప్పారు. వీడియో బయటపడిన సమయంలో ఎంపి మాధవ్ తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పాడు. దీనినిబట్టి ఎంపి ఫిర్యాదు చేశానని చెప్పిన మాట అవాస్తవం కాదా? ఒక బాధిత మహిళ..న్యూడ్ వీడియోపై స్వయంగా వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తుందన్న ఇంగిత జ్జానం, కామన్ సెన్స్ కూడా ఎస్పీకి లేకపోవడం విచారకరం. ఆ వీడియో నిజమో కాదో తేల్చాలి అంటూ వీడియో కాల్ చేసిన ఎంపి ఫోన్ ను ఎందుకు సీజ్ చేసి చెక్ చెయ్యలేదు? మాధవ్ కాల్ రికార్డులు పరిశీలించినా వాస్తవాలు తెలియవా? వీడియో కాల్ డాటా ఎందుకు చెక్ చెయ్యలేదు? వీడియో ఇప్పటి వరకు ల్యాబ్ కు పంపలేదు..ల్యాబ్ కు పంపకుండా నకిలీ వీడియో అని ఎలా చెబుతారు? తాను జిమ్ చేస్తున్న వీడియో అని ఎంపి చెప్పారు..బయటకు వచ్చింది జిమ్ చేస్తున్న వీడియోనా కాదా అనేది కూడా కనీసం ఎస్పీ పరిశోధన చేయలేరా? ఎంపి చేసిన పని రాష్ట్రానికి, దేశానికే అవమానకరం. ఒరిజినల్ వీడియో లేకుండా సోషల్ మీడియా లో తిరిగేది నిజమో కాదో చెప్పలేం అనడం దారుణం. చిన్నపాటి ఆధారం దొరికినా కరుడుగట్టిన నేరగాళ్లను సైతం పట్టుకోవడం నిజమైన పోలీసు బాధ్యత. అలాంటి ఒక కీలకనేత వీడియో దొరికితే అది నిజమా, కాదా అని తేల్చలేని పరిస్థితి మీ అసమర్థతకు నిదర్శనం కాదా? వీడియోలో ఉంది ఎంపినో కాదో కూడా తెలియదని ఎస్పీ చెప్పడం దారుణం.
రోడ్డు మీద శవం దొరికితే ఫిర్యాదు లేదని పోలీసులు విచారణ చేయకుండా వదిలేస్తారా? ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే మార్ఫింగ్ ఉంటే తెలిసిపోతుంది… మార్ఫింగ్ లేకపోయినా తెలిసిపోతుంది. ఆ పని చేయకపోగా… కనీసం వీడియోలో ఉంది ఎంపినో కాదే తెలీదు అనడం ఐపిఎస్ వ్యవస్థకే సిగ్గుచేటు కాదా? ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక తప్పనితేలితే చర్యలుంటాయని సాక్షాత్తు హోంమంత్రి వనిత చెబితే కనీసం ఫోరెన్సిక్ కు ఆ వీడియో పంపకుండా ఎస్పీ బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రెస్ మీట్ ఎలా పెడతారు? ప్రభుత్వం పంపామని చెబుతున్న ఫోరెన్సిక్ నివేదిక ఏమయ్యింది? మహిళా కమిషన్ డిజిపికి ఇచ్చిన ఫిర్యాదు ఏమయ్యింది? ఖాకీ యూనిఫాం వేసుకొని ఇంత అడ్డగోలుగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తారా? ఎస్పి విచారణ కూడా చెయ్యకుండా… జడ్జిమెంట్ ఎలా ఇస్తారు?
– ఆ వీడియోలో ఉన్నది మాధవ్ అవునో, కాదో తేలాల్సి ఉంది. అది తేల్చడానికి ఒరిజినల్ వీడియో అవసరం లేదు. అందుబాటులో ఉన్న వీడియో ద్వారా పోరెన్సిక్ ల్యాబ్‌లో నిజమైనదో, కాదో తేలుస్తారు. ఇది నిపు ణులు చెబుతున్న మాట. ఏ నేరంలోనూ ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఫోరెన్సిక్ పరీక్షలు ఆపరు.
– నేర పరిశోధన కోసమంటూ ఎంపి రఘురామ కృష్ణం రాజు ఫోన్ స్వాధీనం చేసుకొని చాలారోజులపాటు తమ అధీనంలోనే ఉంచుకున్న పోలీసులు… అదేపనిని మాధవ్ విషయంలో ఎందుకు చేయలేదు?
– వీడియోను ల్యాబ్‌కు పంపామని గౌరవ హోం మంత్రి, అంతకంటే ముందు సకలశాఖ మంత్రి సజ్జల చెప్పారు. దీనిపై నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్ డీజీపిని కోరారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాధవ్ ఆ వీడియోను ఫోరెన్సిక్ పరీక్ష చేయించాలని అడిగారు. ఇప్పుడు ఒరిజినల్ వీడియో కావాలంటూ ఈ కేసును భూస్థాపితంచేసి ప్రజలను నమ్మించేం దుకు విఫలప్రయత్నం చేయడం ఆత్మహత్యా సదృశ్యం కాదా?
– ఎంపి మాధవ్ కాల్ రికార్డును పరిశీలించకుండా, ఆయన ఫోన్లను సీజ్ చేయకుండా సంఘటన జరిగిన వారంరోజుల తర్వాత స్పందన లేకుండా ఒక ఐపిఎస్ అధికారి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు.
– ఎవరో పంపిన వీడియోను రెండో వ్యక్తి చూస్తుండగా, మూడవ వ్యక్తి ఫోటో తీశారని ఎస్పీ గారు వ్యాఖ్యా నించారు. దీని అర్థం ఒరిజినల్ వీడియో మీ అధీనం లో స్పష్టంగా అర్థమవుతోంది. మరి దేనికోసం ఆగుతున్నారు.
పై పరిణామాలన్నీ పరిశీలించాక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో సత్యాన్ని సజీవంగా సమాధి చేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవమేమిటో యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, మహిళాలోకానికి తెలిసిపోయింది. అడ్డంగా బుకాయించినంతమాత్రాన అబద్దం నిజమై పోదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… అరాచక పాలనపై నిర్ణయం తీసుకోవాల్సింది విజ్జులైన 5కోట్ల ఆంధ్రప్రజలే.