- అవినీతికి అతనే బ్రాండ్ అంబాసిడర్
- ఆక్వా సాగుకు శ్రీనివాస్ వైరస్
- ఖాళీ భూములను దిగమింగిన వైనం
- భారీగా అక్రమాస్తుల సంపాదన
చక్కటి స్ఫురద్రూపం.
ఎదుటివాళ్లను సులువుగా పడేయడానికి.
చిక్కటి చిర్నవ్వు.
ఎదురొచ్చిన వాళ్లను నిండా ముంచేయడానికి.
అచెంచల వ్యక్తిత్వం.
అవినీతిలో ఆటుపోట్లు తట్టుకోడానికి.
అతన్ని చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అతని గురించి తెలుసుకున్నాక ` నమస్కారం పెట్టి పారిపోవాలనిపిస్తుంది. నిజానికి ` అతనొక అమీబా. రాజకీయ అవినీతిలో సంకోచ వ్యాకోచాలకు ఏమాత్రం వెరవడు. అతనొక వైరస్. నొప్పి తెలియకుండా నాశనం చేయగలడు. అతనే ` భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆక్వాను పట్టిపీడిస్తున్న శ్రీ’వైరస్!
కామా తురానాం నభయం.. నలజ్జ ` ఈ సంస్కృత నానుడినే గ్రంధి తన సంపాదనకు ఆలవాలం చేసుకున్నాడు. కాకపోతే ` కామాతురానాం అన్నది ఆయన అవినీతి సంపాదనకు ప్రతిపదార్థం. అతని రాజకీయాధికారం భీమవరానికి పరిమితమైనంది కనుక `అవినీతి సంపాదనలో వందల కోట్ల వద్దే ఆగాడు. అదే రాష్ట్రాధికారం చేతికి చిక్కివుంటే `అతని పార్టీ అధినేత జగన్‌కు పదిరెట్లు సంపాదించి ఉండేవాడే! ఏదేమైనా.. అవినీతిలో ‘గ్రంధి.. ది గ్రేట్’ అనడంలో సందేహాలు అక్కర్లేదు! అతిశయోక్తి అనుకోనక్కర్లేదు!!
ఆంధ్ర రాష్ట్రంలో `టౌనుకి పట్టణానికి మధ్యనుండే ప్రాంతాల్లో భీమవరం ఒకటి. చిల్లర చిల్లరగా సాగే అతిపెద్ద వ్యాపార కేంద్రం. కోటానుకోట్ల వ్యాపారాలు హడావుడి లేకుండా సాగుపోతుంటాయి. మరోపక్క `సముద్ర తీరానికి సమీపంలోని భీమవరంలో ఆక్వా వ్యాపారం కేంద్రీకృతమెంది. కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు మొదలయ్యాయి. ఆకస్మిక సంపాదనలతో విలాసవంతమైన పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. అదే కలిసొచ్చింది `అవినీతి ‘గ్రంధి’సాంగుడికి!
భీమవరం కో`ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న గ్రంధి `ఆ ఇమేజ్‌తోనే పేద, మధ్యతరగతి వర్గాలను నిండా ముంచాడు. ఆరితేరిన అనుభవం.. వెనకేసిన అవినీతి సొమ్ము పెట్టుబడిపెట్టి `దుష్ట రాజకీయ గుంపునకు దగ్గరయ్యాడు. అలా `రాజకీయాల్లోకి వచ్చిన గ్రంధి శ్రీనివాస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతులేని దందాలకు గ్రంది`సాంగుడయ్యాడు. ఆక్వా రైతులు గ్రంధి శ్రీనివాస్ పేరు చెబితే గజగజలాడతారు.
చేపల చెరువులకు అనుమతులు ఇవ్వడం నుంచి.. పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్నింటిలోను శ్రీ’వైరస్‌కు కప్పంగట్టాలి. కబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, దౌర్జన్యాలే `ఆధునిక రాజకీయాలన్న కొత్త నిర్వచనానికి నాంది పలికాడు. అక్రమమార్గంలో కోట్లు కొల్లగొడుతున్న గ్రంధి శ్రీనివాస్ అవినీతి చరిత్ర అనంతం, అనన్యసామాన్యం. లక్షల నుంచి కోట్ల వరకూ `ఏ దందాలోనూ శ్రీనివాస్ ప్రత్యక్ష పాత్ర ఉండదు. ‘గ్రంధి’ అనే ముద్ర మాత్రమే కనిపిస్తుంది. ఇంటిపేరునే అవినీతికి బ్రాండ్‌నేమ్ చేసుకున్నాడు. గ్రంధి అవినీతి బ్రాండ్‌ను అంతకంతకూ విస్తరించుకుపోతున్న హీరో `రవితేజ. గ్రంధి కొడుకు. వందల కోట్ల విలువైన దందాలు రవితేజ కనుసన్నల్లో సాగిపోతుంటాయి. గత ఐదేళ్లలో ప్రకృతి వనరులను పిండేసి.. రూ.800 కోట్లు వెనకేసిన ఉదంతం చైతన్యరథం ప్రత్యేక కథనం.
మెత్తటి మట్టి మనుషులు!
మెత్తటి మట్టి మనిషులు గ్రంధి కుటుంబం. మట్టంటే పడిచస్తారు. నేల కనిపిస్తే బోర్లాపడి ముద్దెట్టుకుంటారు. అది ఖాళీ అని తెలిస్తే `కబ్జా చేసి పడేస్తారు. నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపిస్తే రాత్రికి రాత్రే ప్రేమించేస్తారు. వృధాగా పడుందన్న బాధతో దొంగ పత్రాలు సృష్టించి దగ్గరకు తీసుకుంటారు. వారం తిరక్కుండా `స్థలాన్ని బ్యాంకుల్లో కుదువపెట్టి కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంటారు. ఈ తంతంగం మొత్తం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేతృత్వంలో `కుటుంబసభ్యులే అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వర్తిస్తారు.
భీమవరం బైపాస్ రోడ్డు సమీపంలో రూ.30 కోట్ల విలువ చేసే 3 ఎకరాల పొలాన్ని అలాగే దగ్గరకు తీసుకున్నారు. కృత్తివెన్ను మండలం కొమ్మలపూడిలో సర్వే నెం.279/1లో 20 ఎకరాలు, బొందాడ గ్రామంలో సర్వేనెం.675/2లో 5 ఎకరాలు భూమిని అలాగే మింగేశారు. భీమవరం పట్టణానికి ఆనుకునివుండే నాయివారి వీధిలో విలువైన స్థలాలను కబ్జా చేసి.. రెసిడెన్షియల్ భవనాలు నిర్మించి సమాజానికి ఎనలేని సేవ చేశారు. అందుకు గ్రంధి కుటుంబానికి దక్కిన ప్రతిఫలం `రూ.60 కోట్లు. మారుతీనగర్‌లో, బస్టాండ్ వెనకాలున్న ఖాళీ స్థలాలనూ దొంగ పత్రాలతో చేజిక్కించుకుని.. కమర్షియల్ భవనాలు నిర్మించి.. రూ.100 కోట్ల మేర సంపాదించి.. అవినీతి సేవలో అనితర సాధ్యులనిపించుకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ `‘గ్రంధి’!
అవినీతి దందాలు
నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని మొదలుపెట్టినా ముందుగా గ్రంధి శ్రీనివాస్‌కి ముడుపులు చెల్లించాలి. భీమవరం మండలం వీరవాసరంలో జలజీవన్ కింద చేపట్టిన రూ.20 కోట్ల పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది. 13వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణానికి అంచనాలు రెట్టింపు చేయడం, భీమవరం 3వ పట్టణంలో 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమాలకు పాల్పడడంవంటి ఎన్నో దందాలు ఇక్కడ చోటుచేసుకున్నాయి.
అవినీతి వరంగా భీమవరం
భీమవరం పట్టణంలో కొత్త భవనాల నిర్మా ణానికి అనుమతులు ఇవ్వడం, బాండ్లు జారీ చేయడంవంటి వాటిల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియ గ్రంధి శ్రీనివాసే. ఇతని ఖాతాలో పైసలు పడితేనే ఫైలు ముందుకెళుతుంది.లేకుంటే కొర్రీలతో చెత్తబుట్ట పాలవుతుంది. కప్పం కట్టినవాళ్లకు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛ గా అక్రమ నిర్మాణాలు చేసుకోవచ్చు.. పట్టణవిభాగం అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడరు. ఐదేళ్లలో ఎమ్మెల్యే దందాకు రూ.50 కోట్లమేర ఆదాయం మున్సిపాలిటీ నష్టపోయినట్లు సమాచారం. ఇక్కడ పనిచేసిన అధికారి రూ.60 కోట్ల మేర అక్రమాస్తులతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారంటే అతని వెనుక ఉన్న పెద్ద చేపల బాగోతాలు అంతులేనివి.
ఇళ్లపట్టాల్లో అవినీతి
గొల్లవానితిప్ప సమీపంలో 100ఎకరాలకు పైగా అసైన్డ్‌భూమిని దిగమింగిన భూబకా సురుడు గ్రంధి శ్రీనివాస్. చివరకు పేదల కు ఇచ్చే సెంటు పట్టాలో కూడా రూ.30 కోట్ల మేర సొమ్ము వెనకేశారు. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి కుటుంబసభ్యులు, అనుచరులతో అక్కడ తక్కువ మొత్తానికి భూమిని కొను గోలుచేసి తరువాత ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి రెట్టింపు రేట్లకు అమ్మి కోట్ల రూపాయలు వెనకేశారు. అప్పటికీ ధన దాహం తీరక ఇళ్లస్థలాల చదును పేరుతో మరో రూ.3 కోట్ల మేర వెనకేశారు.
అవినీతి చేపలు
గత కొంతకాలంగా `ఆక్వాకు కేరాఫ్ అడ్రెస్ భీమవరం. అందుకే `ఆ వ్యాపారంపై తను ఎదగాలనుకున్నాడు ఎమ్మెల్యే గ్రంధి. దందాల వైసీపీ ఇచ్చిన లైసెన్స్ ఉందికనుక `అధికారాన్ని ప్రయోగించాడు. ఆక్వా సాగులో అన్ని విభాగాలకు కప్పం నిర్ణయించాడు. అలా ఆక్వా దందా మొదలైంది. చేపల చెరువుకు అనుమతి ఇవ్వడం నుంచి సీడ్, దాణా, ఉత్పత్తుల అమ్మకం వరకు అన్నింటిలోను గ్రంధి శ్రీనివాస్‌కు కప్పం కట్టక తప్పని స్థితి వచ్చింది. చేపల చెరువు అనుమతికి ఎకరాకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేశారు, చేస్తున్నారు. చెరువుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే రూ.లక్ష. దాణా లైసెన్స్‌కు 5 నుంచి రూ.10 లక్షలు. ఇలా ప్రతి దశకూ రేటు పెట్టి ఆక్వాను అల్లాడిరచాడు గ్రంధి. అలా సంపాదించిన అవినీతి సొమ్మును అదేరంగంలో పెట్టుబడి పెట్టడం..
అతని కుటుంబ సేవా స్పృహకు నిలువెత్తు నిదర్శనం. అలా పుట్టుకొచ్చిన కంపెనీలే `జయ, విజయ ఆక్వా ఫార్మ్, జేవీఆర్ హనుమాన్ ఫిష్ ఫార్మ్స్, జెయస్ ఆగ్రో ఫార్మ్స్, ఎస్‌జి ఆక్వా ఫార్మ్, సాగర్ గ్రంథి ఎక్స్‌పోర్ట్స్, షుగర్ ఐస్ ప్లాంట్స్‌వంటి కంపెనీలు. ఆక్వా రైతులు ఈ కంపెనీల నుంచే ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఇది గ్రంధి ఆదేశం. కాదని సాగుకు సిద్ధమైతే `చెరువులో పడి చావాల్సిందే! ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కంపెనీలనుంచి కాకుండా ఇతర కంపెనీలనుంచి ఆక్వా రైతులు ఏమైనా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే సాయంత్రానికల్లా ఆ రైతుల మీద అధికారులతో దాడులు చేయించి వేధింపుల పర్వానికి శ్రీకారం చుడతారు. ఆక్వాలో అవినీతి దందా కొనసాగిస్తూ అయిదేళ్లలో రూ.250 కోట్ల మేర వెనకేశాడు గ్రంధి.
మద్యం మాఫియా
భీమవరం నియోజకవర్గంలో బార్ పెట్టాలంటే ముందు గ్రంధి శ్రీనివాస్ కుమారుడు రవితేజకు సూట్‌కేసు అందజేయాల్సిందే. నియోజకవర్గంలోని 25 బార్‌లవద్ద రూ.3 కోట్ల మేర సొమ్ము వసూలు చేసి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కూడా డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ను విక్రయించే దందానూ రవితేజే నిర్వహిస్తుంటారు. అధిక ధరలకు మద్యాన్ని కొనలేక నాటుసారా తాగి ఆసుపత్రి పాలైన సంఘటనలు కోకొల్లలు. భీమవరంలో పర్సంటేజీలు, ట్యాక్స్‌లే కాదు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ప్రతి పనికీ రేటు పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయాలన్నా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో చేరాలన్నా ఎమ్మెల్యే కుటుంబానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. సబ్‌స్టేషన్ ఉద్యోగాలు రూ.25 లక్షలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు రూ.2 కోట్లు, అధికారుల బదిలీ, పోస్టింగుల్లో రూ.5 కోట్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు రూ.12 కోట్లు, కోడిగుడ్లు, చిక్కీ సరఫరా నుంచి రూ.80 లక్షలు, అంగన్‌వాడీ పోస్టుల అమ్మకం రూ.40 లక్షలు, పోలీస్ స్టేషన్‌లనుంచి మామూళ్లు రూ.3 కోట్లు. అవినీతి ఇలాకలో `‘గ్రంధి.. ది గ్రేట్’ అనేది.