అమరావతి, చైతన్యరథం: ఈనెల 17వ తేదీన చిలకలూరిపేట వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి గా నిర్వహిస్తున్న బహిరంగసభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు మంగళవారం లేఖ రాశారు. చిలకలూరిపేటలోని బొప్పూడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈనెల 17వ తేదీన మద్యా హ్నం రెండు గంటల నుండి ఎనిమిది గంటల వరకు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈసభలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు టీడీపీ అధినేత ఎన్.చంద్ర బాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. మూడు పార్టీల నేతలు పాల్గొంటు న్నారని తెలిపారు. ఈ సభకు రాష్ట్రంతోపాటు పోరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవ్వనున్నా రని అన్నారు. వీరితోపాటు మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్య కర్తలు, సానుభూతిపరులు కూడా పెద్ద ఎత్తున హాజ రౌతున్నారని, ఈ నేపథ్యంలో బహిరంగ సభకు ఎటు వంటి ఆటంకాలు కలగకుండా తగిన భద్రతా ఏర్పా ట్లు చేయాలని డీజీపీని అచ్ఛెన్నాయుడు కోరారు. అదే విధంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు కూడా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఆ లేఖలో కోరారు.