వెదురుకుప్పం మండలం జక్కిదోన పంచాయతీ , జక్కిదోన గ్రామంలో ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
టిడిపి మండల అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, క్లస్టర్ ఇంచార్జి పి. మోహన మురళి ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి స్థానిక క్లస్టర్ ఇంచార్జి పి. మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. ఈ రాక్షస పాలన పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.