- మంచి వాతావరణం, విద్యావికాసానికి నాంది
- రాజకీయాలకు అతీతంగా పాల్గొని సూచనలివ్వాలి
- గత ప్రభుత్వంలో విద్యాప్రమాణాలు దిగజారాయి
- లోకేష్ చర్యలతో విద్యాశాఖకు పూర్వవైభవం
- మాజీ మంత్రి పీతల సుజాత
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7న జరిగే ‘పాఠశాల పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పీతల సుజాత పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నారా లోకేష్ ‘పాఠశాల పండుగ’ కార్యక్రమానికి స్వీకారం చుట్టనున్నారని, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యా యులు, పూర్వ విద్యార్థులు, దాతలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సత్సంబంధాలు ఏర్పడ టమే కాకుండా విద్యార్థులలో నెలకొన్న భయాలు తొలగిపోతాయన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విద్యా వికాసానికి, ఒక మంచి వాతావరణానికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. లోకేష్ విద్యాశాఖ మంత్రి కాగానే విద్యాశాఖ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. .కూటమి ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతోంది..16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల స్కూళ్లలో విద్య కుంటుపడేలా జగన్ జీవో ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే సమస్యను పరిష్కరించి త్వరలో గిరిజన ఉపాధ్యాయులను కూడా నియమించబోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోం దని వివరించారు. ఉపాధ్యాయులపై ఉన్న భారాలను తగ్గించి విద్యార్థులకు చదువు చెప్ప డమే వారి పనిగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఎయిడెడ్ పాఠశాలలపై కత్తికట్టారు..విద్యాశాఖను అట్టడుగు స్థానానికి దిగజార్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అటువంటి వేధింపులు తగ్గాయి..ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని తెలిపారు.
జగన్ విద్యాప్రమాణాలు దిగజార్చారు
జగన్ హయాంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ దొరికేది.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకుండా చేశారు. జగన్ హయాంలో కాలేజీ, స్కూళ్లలో కూడా గంజాయి, డ్రగ్స్ దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్ బారినపడకుం డా కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విద్యాప్రమాణాల్లో ఏపీ బెస్ట్‌గా నిలిచింది..విద్యా శాఖను దేశంలో ఏపీని 3వ స్థానంలో నిలిపారు. జగన్ హయాంలో అదికాస్త 19వ స్థానానికి దిగజార్చారని మండిప డ్డారు. లోకేష్ తీసుకున్న చర్యల వల్ల మళ్లీ విద్యాశాఖకు పూర్వవైభవం రానుందని తెలిపా రు. ఎడ్యుకేట్, ఎంపవర్, ఎంగేజ్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసా రి డిసెంబర్ 7న ఈ ‘పాఠశాల పండుగ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఒక మంచి వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పలుకు తు న్నామని తెలిపారు. అందరూ హాజరై విద్యార్థుల భవిష్యత్తు కోసం మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.