• కావలి అంబేద్కర్ సెంటర్ లో కావలి డివిజన్ మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కావలి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయినా నేటికీ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
• టీడీపీ పాలనలో భవనం కోసం నిధులు మంజూరు చేశారు.
• వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రికి దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు.
• దళితులు ఎక్కువగా ఉన్న కావలి, ఉదయగిరి ప్రాంత ప్రజలకు అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• దళితుల ఓట్లతో అధికారాన్ని చేపట్టిన జగన్… దళితులపైనే కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు.
• గత నాలుగేళ్లలో రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళితద్రోహి జగన్.
• దళితుల సంక్షేమానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేశారు.
• బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీవిద్య వంటి పథకాలను రద్దుచేసి తీవ్ర అన్యాయంచేశారు.
• జగన్ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన దళితులపై వైసిపి గూండాలు దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.
• దళితులను చంపి డోర్ డెలివరీ చేయడానికి జగన్ ప్రభుత్వం అరాచకశక్తులకు స్పెషల్ లైసెన్సులు ఇచ్చింది.
• డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ అచ్చన్న వరకు ఎందరో దళితులను జగన్ ప్రభుత్వం పొట్టనబెట్టుంది.
• దళితుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
• అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• కావలిలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.