చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘మన మిత్ర’

వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Jan 31, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘మన మిత్ర’
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం
  • వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌
  • ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌ గవర్నెన్స్‌
  • ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే
  • మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు
  • తరువాతి దశలో మరో 360 పౌర సేవలు
  • పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా

అమరావతి (చైతన్యరథం): ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సప్‌ నెంబర్‌ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశానన్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్‌ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తోంది, క్యాబ్‌ వస్తుంది, ఒక బటన్‌ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా. అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ను ప్రారంభిస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే..
యువగళం పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఉదయం బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి మళ్లీ తిరిగి బస్సు ఎక్కేవరకు ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో ఉండి వారి సమస్యలు విన్నా. రైతులు, మహిళలు, విద్యార్థులు, కులవృత్తుల వారిని కలిశాను. వారంతా ఒక్కటే అడిగారు.. కుల ధృవీకరణ పత్రం ఇన్నిసార్లు ఎందుకు తీసుకోవాలి అని. ఆదాయ ధృవపత్రం కోసం మళ్లీ మళ్లీ అధికారుల వద్దకు ఎందుకు వెళ్లాలని అడిగారు. విద్యుత్‌ బిల్లు చెల్లించాలంటే ఎందుకు సీమ్‌ లెస్‌గా చెల్లించలేకపోతున్నాం? బస్సు ఎక్కిన తర్వాతే ఎందుకు టికెట్‌ తీసుకోవాలి? ముందే తీసుకోకూడదా అని పదేపదే నన్ను అడిగారు. గత ఐదేళ్ల పాలనలో సర్టిఫికెట్లు రానివ్వకుండా చేశారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి నాటి ప్రభుత్వం కావాలనే ధృవపత్రం ఇవ్వలేదు. వ్యవస్థలో లోపాలను సరిచేయాలని భావించా. ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన మొదలైంది. ప్రతి ఇంట్లో, జేబులో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. 60శాత ంమందికి స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. వారంతా వాట్సప్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకుంటారు. వాట్సప్‌తో వర్క్‌ చేయాలని యువగళం పాదయాత్ర సమయంలోనే అనుకున్నా. దీంతో మెటా ఇండియా హెడ్‌ సంధ్యని కలిసి మాట్లాడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫాం ద్వారా తీసుకురాలేదు. ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడా లేదు. మీరు చేయగలుగుతారా అని అడిగారు. గతేడాది అక్టోబర్‌ 22న ఢల్లీిలో మెటా సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఆ రోజు నేను ఛాలెంజ్‌ను స్వీకరించాను. డిసెంబర్‌ నాటికి ప్రారంభిస్తామని చెప్పాను. ఎంవోయూ జరిగిన మూడు నెలల 9 రోజుల తర్వాత ప్రారంభిస్తున్నామని మంత్రి లోకేష్‌ వివరించారు.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు
వాట్సప్‌ గవర్నెన్స్‌కు 36 శాఖలను అనుసంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌ గవర్నెన్స్‌. రియల్‌ టైంలో ధృవపత్రాలు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆ క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏపీ గవర్నమెంట్‌ వెబ్‌ సైట్‌కు ఆ లింక్‌ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు నెంబర్‌ సెలెక్షన్‌ ద్వారా రెవెన్యూ, మున్సిపల్‌, ఎండోమెంట్‌ సర్వీసులతో పాటు అనేక సర్వీసులు తీసుకువచ్చాం. రెండో దశలో ఏఐ బాట్‌, వాయిస్‌ ద్వారా కూడా అమలుచేస్తాం. ప్రపంచంలోనే వాట్సప్‌ గవర్నెన్స్‌ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనది. దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లోటుపాట్లు సరిచేసుకుని మరింత మెరుగ్గా దీనిని తీర్చిదిద్దుతాం. రియల్‌ టైం గవర్నెన్స్‌ లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తున్నాం. డేటా లేక్‌ క్రియేట్‌ చేసి సీమ్‌ లెస్‌ సర్వీసెస్‌ అందిస్తాం. గత మూడు నెలలుగా మా టీం అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా టెస్టింగ్‌ చేస్తున్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం. ఆరు నెలల్లో ఐడియల్‌ ప్రొడక్ట్‌గా తీర్చిదిద్దుతాం. అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా. ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారని మంత్రి లోకేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
సులభంగా వినయోగించేలా: మెటా ఇండియా హెడ్‌ సంధ్య
మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ సంధ్య దేవనాథన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. మన మిత్ర వాట్సప్‌ సేవలు ప్రారంభిస్తున్నాం, ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సప్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన మిత్ర ద్వారా 161 పౌర సేవలను ప్రతి ఒక్కరికి అందిస్తాం. ప్రజలు సులభంగా వినియోగించేలా వాట్సప్‌ గవర్నెన్స్‌ను రూపొందించాం. వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవల కోసం చాలా కృషిచేశామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మరింత మెరుగ్గా: వాట్సప్‌ ఇండియా హెడ్‌ రవి గార్గ్‌
వాట్సప్‌ డైరెక్టర్‌, ఇండియా హెడ్‌ రవి గార్గ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. అయితే సింగిల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై అన్ని రకాల సేవలు అందించడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. హాయ్‌ అని టైప్‌ చేయడం ద్వారా ప్రజలు సులభంగా పౌరసేవలను పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం 161 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని, ఆర్టీజీఎస్‌ సీఈవో కే.దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

Previous Post

ఏటికొప్పాక బొమ్మలకు జేజేలు

Next Post

సాక్షి పత్రిక, వైసీపీ సోషల్‌ మీడియాపై పరువునష్టం కేసు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist