- మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా… ఆశీర్వదించండి
- తటస్థ ప్రముఖులతో వరుస భేటీల్లో నారా లోకేష్
తాడేపల్లి (చైతన్యరథం): మంగళగిరి నియోజక వర్గాన్ని రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచా లన్నదే తన ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తానని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. తాడేపల్లి పట్టణం లోని పలువురు తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత తాడేపల్లి 20వవార్డులో నివాసం ఉంటున్న నిర్మాణసామగ్రి వ్యాపారి మలిశెట్టి శ్రీనివాస రావు ఇంటికివెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువ నేతకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా శ్రీనివాసరావు వ్యాపారంలో తాము ఎదుర్కొం టున్న ఇబ్బందులను తెలియజేస్తూ…ఇసుక ధర అందు బాటులో లేకపోవడంతో అన్నిరకాల నిర్మాణాలు దెబ్బ తిన్నాయని తెలిపారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులు కూడా నిలిపివేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
లోకేష్ స్పం దిస్తూ… మరో రెండునెలల్లో ప్రజాప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీని తెచ్చి నిర్మాణ రంగానికి గతవైభవం చేకూరుస్తానని భరోసా ఇచ్చారు. తర్వాత తాడేపల్లి 18వ వార్డులో నివాసముం టున్న లారీ ట్రాన్స్‌పోర్టర్ ముత్తే శ్రీనివాసరావును కలుసుకు న్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తమ కష్టాలను చెబుతూ… గత కొంతకాలంగా పన్నుపోటుతో రవాణా రంగం కుదేలైందని వాపోయారు. 200 రూపాయలు ఉండే గ్రీన్‌ట్యాక్స్‌ను 20రెట్లకు పైగా పెంచారని వాపో యారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… యువగళం పాదయాత్ర సందర్భంగా తనను ట్రాన్స్ పోర్టు రంగా నికి చెందిన పలువురు కలిశారని, యజ మానులుగా ఉన్న తాము డ్రైవర్లుగా మారిపోయామని చెప్పారన్నా రు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అడ్డగో లు పన్నులను పునఃసమీక్షించి, దేశం మొత్తమ్మీద తక్కువ పన్నులు ఉండేలా చేసి ట్రాన్స్‌పోర్టు రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. చివరగా తాడేపల్లి 18వ వార్డుకే చెందిన మక్కపాటి ఉమాశంకర్ కుటుం బాన్ని కలుసుకున్నారు.
బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్య లను ఉమాశంకర్ యువనేత దృష్టికి తెచ్చారు. లోకేష్ స్పందిస్తూ… చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గత టీడీపీ ప్రభు త్వం కార్పొరేషన్ ద్వారా 5ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షే మానికి రూ.285 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొ రేషన్‌ని మరింత బలోపేతంచేసి, బ్రాహ్మణులని పేదరి కం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తామ ని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించా లని కోరారు.