• సంతనూతలపాడు నియోజకవర్గం మంగమూరు గ్రామస్తులు యవనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 5వేల జనాభా నివాసం ఉంటున్నాం.
• గ్రామంలో గ్రౌండ్ వాటర్ సౌకర్యం లేదు. పంచాయితీ నీటి సరఫరా పైనే ఆధారపడ్డాం.
• మాకు సరఫరా చేసే నీటిని ఫిల్టర్ చేయకుండా ఇస్తున్నారు.
• దీనివల్ల నిత్యం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక గ్రామంలోని అన్ని ప్రాంతాలకు సురక్షిత నీటిని అందించాలి.
• ఎస్సీ కాలనీకి నీటి సరఫరాను పునరుద్ధరించాలి.
• ఒంగోలు నుండి మంగమూరు రోడ్డులోని నల్లవాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలి.
• మంగమూరు నుండి చండ్రపాలెం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో 10వ కిలోమీటర్ వద్దనున్న సాగర్ కాలువపై తారురోడ్డు నిర్మించాలి.
• ఈ మార్గంలో బస్సు సౌకర్యం ఏర్పాటుచేస్తే ప్రజలకు రాకపోకలకు సమస్య తొలగిపోతుంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభ్రమైన నీరు అందించే పరిస్థితి లేదు.
• పంచాయితీలకు చెందిన రూ.9వేల కోట్ల నిధులను దారిమళ్లించడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా స్వచ్చమైన తాగునీరు అందించాం.
• మేం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి సురక్షితమైన తాగునీరు అందిస్తాం.
• నల్లవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
• సాగర్ కాలువపై తారురోడ్డు నిర్మించి,రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.