- దేశంలో ఏపీ ప్రభావవంతమైన రాష్ట్రం
- కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం
- యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ
- అవకాయ్ ఫెస్టివల్‌కు హాజరైన డెల్ఫీ
విజయవాడ (చైతన్యరథం): విజయవాడలో జరుగుతున్న ఆవకాయ ఫెస్టివల్‌లో పాల్గొవటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని మన దేశంలో యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ అన్నారు. కృష్ణా తీరంలో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న అవకాయ్ ఫెస్టివల్‌కు గురువారం హాజరైన ఆయన మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ అంతా కలిసి నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు సంప్రదాయ వంటకంగా ఆవకాయది విశేషమైన రుచి. కొత్త రాజధాని నగరం అమరావతి అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ భారత్ లో ఓ ప్రభావంతమైన రాష్ట్రం. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్థిక వృద్ధ్దిలో పెట్టుబడులతో ఏపీ లీడిరగ్ స్టేట్ గా ఉంది. దేశీ పెట్టుబడులను ఏపీ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఈ డైనమిజం యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇండియా- ఈయూ సమ్మిట్ ఢల్లీిలో జరుగబోతోంది. రెండు దేశాల మధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుంది. సెమీ కండక్టర్స్, అగ్రి ఫుడ్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ , ఇన్నోవేషన్ హబ్, స్టార్టప్ హబ్స్ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేస్తాం. రక్షణ రంగంలోనూ భారత్ తో ఎత్తున కలిసి పనిచేయాలని ఈయూ భావిస్తోంది. ఈయూ- ఇండియా బంధంలో ఏపీ కూడా ఓ కీలక భాగస్వామిగా ఉండబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలో కలిసి పనిచేసే ఆస్కారం ఉంది. ఈయూ- భారత్ మధ్య భాగస్వామ్యాన్ని ఈ సంస్కృతి, సంప్రదాయాలు మరింత దగ్గర చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని సంస్కృతీ సంప్రదాయాలు ఈయూకి దగ్గరగా ఉన్నాయి. తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ లాంటి దిగ్గజాలు సృష్టించిన ప్రభావం అద్వితీయం. రాజమౌళి తీసిన సినిమాలు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను చూశాను. అందులో నాటు నాటు పాట నన్ను ఎంతో ఆకర్షించింది. ఏపీకి చెందిన కూచిపూడి, కలంకారి, కొండపల్లి బొమ్మలు ప్రపంచాన్ని ఎప్పుడో ఆకర్షించాయి. కళలు, సినిమా, సాహిత్యం, సంగీతం వివిధ సమాజాలను దగ్గర చేస్తాయి. ఇటీవల జరిగిన 30 వ ఈయూ ఫిలిం ఫెస్టివల్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్వహించేందుకు ఆస్కారం ఉంది. యూరోపియన్ యూనియన్ గా మేము ఏపీతో కనెక్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని డెల్ఫీ చెప్పారు.












