• కోవూరు నియోజకవర్గం మండబయలు గ్రామంలో మీ-సేవ సిబ్బంది యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో 2003లో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ప్రారంభించారు.
• గత 19 సంవత్సరాలుగా 139రకాల సేవలను మీ-సేవ కేంద్రాలద్వారా ప్రజలకు అందిస్తున్నాము.
• ప్రస్తుతం మాకు రూ.8వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 మార్చి నుంచి రామ్ ఇన్ఫోటెక్ వారు మాకు ఇవ్వాల్సిన జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదు.
• సచివాలయ వ్యవస్థ రాకతో మీ-సేవలు కూడా నిలచిపోయాయి.
• దీర్ఘకాలంగా జీతాల్లేక, వేరే ఉద్యోగాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
• దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఈ వ్యవస్థను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.
• వేలాదిమంది మీ-సేవ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు.
• తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ-సేవ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం.
• మీ-సేవ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను అందజేసి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం.