- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి
- మరింత మెరుగైన విధంగా వాలంటీర్లను కొనసాగిస్తాం
- వైసీపీ మళ్లీ వస్తే మీ సొంత ఆస్తులపైనా హక్కులుండవు
- యువశక్తిని నిర్వీర్యం చేసి… సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్
- యువత జీవితాన్ని చీకటిమయం చేసిన జగన్‌ను ఇంటికి పంపాలి
- వైసీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్
- ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన, అన్ని కోర్సులు అందుబాటులోకి
కుప్పం(చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు మంగళవారం యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు.. యువత నిరాశతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేవు. మీ జీవితాలను చీకటి మయంచేసిన జలగను ఇంటికి పంపాలి. మోసం చేయడంలో జగన్ దిట్ట. ఏటా జాబ్ కేలండర్ ఇస్తానన్నాడు… ఐదేళ్లు అయింది ఒక్క జాబ్ కేలండర్ అయినా వచ్చిందా? ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ అని మోసం చేశాడు. పోతూ పోతూ అధికారం చివరి రోజుల్లో దగా డీఎస్సీ వేశాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రకటించిన డీఎస్సీని కొనసాగిస్తే ఈ దుర్మార్గులు మళ్లీ వ్యవస్థలను మేనేజ్ చేసివారికి అనుకూలమైన వారిని నియమించు కునే ప్రమాదం ఉంటుంది…ఎన్నికల కమిషన్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం పెడతాం. ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులను ప్రవేశపెడతాం. కుప్పంను నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వాలంటీర్లకు మెరుగైన జీవితం
వైసీపీ నమ్ముకుంది రౌడీయిజాన్నే. వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదు…ఇంజనీరింగ్ చేసినవాళ్లు కూడా వాలంటీర్లుగా చేస్తున్నారు. వైసీపీ నేతలు చేయించే తప్పుడు పనులతో వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దు. వాలంటీర్లు కూడా సమాజంలో భాగమే… వారిని కొనసాగించి మెరుగైన జీవితాన్ని అందిస్తాం. ఉద్యోగులకు జీతాలు ప్రజలు కట్టే పన్నుల నుండే వస్తాయి…రాజకీయ కార్యక్రమాల్లో ఉద్యోగులు జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు హితవు పలికారు.
నేను పనిచేసేది యువత కోసమే
ఇక్కడి యువత ఉత్సాహం చూస్తుంటే తనకు మళ్లీ పాతరోజులు గుర్తొస్తున్నాయన్నారు. విద్యార్థి రాజకీయా ల నుండి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. యువతను ఎప్పుడు చూసినా నాకు ఉత్సాహం వస్తుంది. నేను ఆధారపడిరది యువశక్తి పైనే… పని చేసింది… చేసేది యువత కోసమే. ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు… మహాత్మగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టిన వారే. నేను కూడా చిన్న రైతు కుటుంబంలో పుట్టాను. నా చిన్న తనంలో లాంతర్లు పెట్టి చదువుకున్నా. ఉక్కు కండరా లు ఉండే యువతను నాకు ఇవ్వండి ప్రపంచాన్ని మారుస్తానని స్వామి వివేకానంద అన్నారు. ఆయన అన్నదాన్ని నేను నిరూపించా. బాగా చదివిస్తే యువత ప్రపంచాన్నే జయిస్తారు. వందల ఎకరాలు, డబ్బులు ఇచ్చినా తెలివిలేని వాడు అయితే పోగొట్టుకుంటాడు. నాడు ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ పెడతానంటే ఎగతాళి చేశారు… కానీ చేసి చూపించాను. డి రెగ్యులేషన్‌తో టెలీకమ్యునికేషన్ విధానాన్ని తీసుకొచ్చాం. నా తమ్ముళ్ల కోసం జీవితాంతం పని చేస్తా అని చంద్రబాబు అన్నారు.
వదిలే ప్రసక్తే లేదు
2018లో గ్రూప్ వన్‌కు నేను నోటిఫికేషన్ ఇచ్చా ను. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక విధానాలను మార్చి డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. నిరుద్యోగుల పోరా డారు… న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మాన్యువల్ మూల్యాంకనం చేయించాలని చెప్పింది. కానీ వీళ్ల మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకునేందుకు అందులో నూ అక్రమాలకు పాల్పడ్డారు. కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇవ్వడంతో కోర్టు వాతలు పెట్టింది. యువత ఎన్నో ఏళ్లు కష్టపడి చదివి పరీక్షలకు వెళ్తే ఈ ప్రభుత్వం పోస్టులు అమ్ముకుని యువత భవి ష్యత్‌ను నాశనం చేసింది. జగన్‌ను హెచ్చరిస్తున్నా… యువత ను భవిష్యత్తును నాశనం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పెట్టుబడులను తరిమేశారు
ఏపీ గతంలో పెట్టుబడులకు చిరునామా. ప్రపంచ మంతా నాడు తిరిగి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాను.అనంతపురం జిల్లాకు కియామోటార్స్ తెచ్చా.. మనదగ్గర తయారైన కార్లు ప్రపంచమంతా తిరుగుతు న్నాయి. నేడు 12లక్షల కియా కార్లు రోడ్లు మీద తిరు గుతున్నాయి. వీళ్లు వచ్చాక జాకీ పరిశ్రమలో వాటా అడిగి తరిమేశారు. అమర్‌రాజా పరిశ్రమను కూడా వేధించి తెలంగాణకు తరిమేశారు.ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులను కూడా పెట్టుబడులు పెట్టనీయడం లేదు. ఐదేళ్లలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి వచ్చిందా… ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా? కియాకు 650 ఎక రాలు ఇచ్చి వేల ఉద్యోగాలు తెచ్చాం. కానీ వీళ్లు దోపిడీ కోసమే భూములు కేటాయిస్తారు.8వేల ఎకరాల లేపాక్షి భూములను నాలెడ్జ్ హబ్‌కు తీసుకున్నారు. ఇక్కడి ప్రజ లకు ఏమైనా ప్రయోజనం దక్కిందా.. వాటిపై ఇప్పుడు జగన్ కన్ను బడిరది. 10 వేల కోట్లు విలువ చేసే భూములను రూ.500 కోట్లకు కొట్టేయాలని చూశారు. భూములు కేటాయించి ఉద్యోగాలు నేను ఇస్తే…. భూములపైనే స్కాములు చేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
వైసీపీని భూస్థాపితం చేయాలి
కుప్పం గ్రానైట్ ఎంతో పేరుగాంచింది. 5 ఏళ్లుగా వైసీపీ నేతలు దోచు కుంటున్నారు. కేజీఎఫ్ తరహాలో గ్రానైట్ తవ్వి అమ్మేసుకుంటున్నారు… ఇక్కడే ఇలా జరిగితే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? గనులు, ఇసుక, బెరైటీస్ లాంటి ఖనిజ సంపదనంతా దోచేశారు. ప్రజల ఆస్తి ప్రజలకే అందాలి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లోకి వెళితే ప్రమాదకరం. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. జగన్ ఇంట్లో కూర్చుని ఏమేమి రికార్డులు మార్చాలో వివరాలన్నీ రాసుకున్నారు. ఒంటిమిట్టలో చేనేత వర్గానికి చెందిన సుబ్బారావుకు చెందిన 3 ఎకరాల భూమిని రికార్డులు తారుమారు చేసి లాక్కున్నారు. దీంతో ఆ కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ మళ్లీ వస్తే మీ ఇంటి మీద కూడా మీకు హక్కులుండవు. యువత ముందుకొచ్చి వైసీపీని భూస్థాపితం చేయాలి. నా మీద కేసుల మీద కేసులు పెట్టాను. నా జీవితంలో భయం అనేది ఎరగలేదు. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
20 లక్షల ఉద్యోగాలు
అధికారంలోకి వచ్చాక యువగళం ద్వారా 20 లక్ష ల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేల భృతి ఇస్తాం. కుప్పంను బెంగళూరు, కోలార్, కృష్ణగిరితో అనుసంధానం చేస్తాం. ఏ రైలువచ్చినా కుప్పంలో ఆగేలా చేస్తాం.విమానాశ్రయాన్ని కూడా నిర్మి స్తాం… ఇక్కడి నుండే వ్యవసాయ ఉత్పత్తులు విదేశా లకు పంపవచ్చు. పాడి పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేస్తాం. 20 అంశాలతో కుప్పం అభివృద్ధికి విజన్ రూపొందిస్తానని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రం కోసమే పొత్తు
మూడు పార్టీలు కలిశాక కొందరు అనుమాన పడుతున్నారు. ఎన్డీఏలో ఉన్నా, లేకున్నా మైనారిటీలకు న్యాయం చేసింది టీడీపీనే. ఉర్దూను రెండు అధికార భాషగా చేశాం. మైనారిటీ సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నేను కడప, విజయవాడలో హజ్ హౌస్‌లు నిర్మించా. మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చాం… దుల్హన్ కింద రూ.50 వేలు ఆర్థికసాయం అందించాం. ఈ ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల కోసం ఒక్కపనైనా చేసిందా. పార్లమెంట్లో తెచ్చిన అన్ని పాలసీలకు వైసీపీ ముందుండి మద్దతు తెలిపింది. కానీ మేము రాష్ట్రాన్ని బాగుచేయడానికే పొత్తు పెట్టుకున్నాం. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశాడు అప్పుల అప్పా రావు. వ్యవస్థలను సర్వనాశనం చేశాడు. కేంద్రం సాయం లేకపోతే రాష్ట్ర ముందుకు సాగడం కష్టం అవు తుంది.
రైతుల ఆత్మహత్యలు పెరి గాయి… అమరావతిని నాశనం చేశారు… మహిళలపై దారుణాలు పెరిగాయి… వీటన్నింటినీ సరిచేయడానికే ఎన్డీఏలో చేరాం. సీట్లు కోసం కాదు… రాష్ట్రాన్ని కాపాడటానికి బాధ్యతగా కలిసి ముందుకు వస్తున్నాం. జెండాలు మూడు… కానీ మా అజెండా ఒక్కటే… అది ఏపీని కాపాడు కోవడమే. ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి.. అప్పుడే యువత భవిష్యత్తు బంగారంఅవుతుందని చంద్రబాబు అన్నారు.
జగన్‌ను చిత్తుగా ఓడిరచాలి
ఇప్పటి పరిస్థితుల్లో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా జగన్‌కు ఓటేయరు. 2004లో కొత్తవాడు వస్తే ఇంకా బాగు చేస్తాడని అనుకుని ఓటేశారు… కానీ ఏం జరిగింది.? మళ్లీ 2019లో ఇంకో దుర్మార్గుడు వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో కరిగిపోయారు… గెలిచాక నిజస్వరూపం చూపించి దాడులు, పిడిగుద్దులు గుద్దాడు. డ్రామాల్లో జగన్ నెంబర్ వన్. హంద్రీనీవా నీళ్లు అంటూ సినిమా సెట్టింగ్ వేసి గేటు బెట్టి బురద చేశారు. జగన్ వెళ్లిపోయాక గేటు పీకేశాడు… బురద ఆరి పోయింది. ఇంకో నాటకంతో మళ్లీ కొత్త బిక్షగాడిలా మళ్లీ వస్తాడు. వాళ్లు చేసిన అన్యాయాలు చూసి చిత్తుగా ఓడిరచాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.