- ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై మంత్రి డోలా
- ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీలనుఅడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తిస్ధాయి దర్యాప్తునకు మంత్రి ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్దిని ఆత్మహత్య ఘటన విచారకరమని, మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఏమైనా సమస్యలుంటే టీచర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప విద్యార్దులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని బంగారు భవిష్యత్ పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా విద్యార్దిని కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాడ సానుభూతి ప్రకటించారు.