అమరావతి(చైతన్యరథం): మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఫేకు జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా! నీలా నాకు క్విడ్ ప్రో కో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీలా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్ళాను. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుండి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది చిల్ బ్రో! సరే కానీ బాబాయ్ ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్ అని ఎక్స్‌లో లోకేష్ సవాల్ విసిరారు.