- ట్రాక్టరులో ఇంటింటికీ వెళ్లి సహాయక చర్యలు
- బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా
- అవివేకంతోనే జగన్ అర్థం పర్థం లేని ఆరోపణలు
- సైకో రెడ్డిని వరద బాధితులే ఛీకొట్టారని ధ్వజం
విజయవాడ(చైతన్యరథం): నగరంలోని అజిత్ సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదవ రోజూ శుక్రవారం న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ పర్య టించారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, ఇతర ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు. అజిత్‌సింగ్ నగర్, దాబకొట్ల రోడ్డు, ముస్తఫా మసీద్ వీధి తదితర ప్రాంతాల్లో మోకాటి లోతు నీళ్లలో వరద బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండడంతో ట్రాక్టరుపై ఎక్కి పరి శీలించారు. తాగునీటి బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేశా రు. ముంపునకు గురి కావడంతో ముస్తఫా మసీదులో పంపింగ్ మోటార్ కాలిపోయిందని, మైక్ ఆడియో పరికరాలు, ప్రేయర్ మ్యాట్లు దెబ్బతిన్నాయని ఆదుకోవాలని నిర్వాహకులు కోరారు. స్పందించిన మంత్రి ఫరూక్ ముంపు ప్రాంతాలలో ఉన్న మసీదులలో వివిధ రకాల నష్టాలపై అంచనా వేసి నివేదిక ఇవ్వాలని వక్ఫ్ బోర్డు సీఈవోను ఆదేశించారు. నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా తదుపరి చర్యలు తీసు కుంటామని వెల్లడిరచారు
అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు
ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అరాచక పాలన సాగించిన జగన్‌రెడ్డి విపత్తు సమయంలో కూడా అవివేకంతో అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ తనలోని సైకోతత్వాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిద్రాహారాలు మాని మంత్రి వర్గంతో పాటు అధికార యంత్రాంగం వరద బాధితులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేస్తుంటే వైసీపీ నాయకులు బురదజల్లేందుకు ప్రయత్నిస్తుండడం చూసి రాష్ట్ర ప్రజలంతా సైకో జగన్‌రెడ్డి, సైకో వైసీపీ నాయకుల తీరును చూసి అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం లేదని విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు ఆయనే సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
తాను పర్యటిస్తే వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుం దని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసి కూడా పదేపదే ఆరోపణలు చేస్తుండటం అర్థరహితమని అన్నారు. ప్రతి వరద బాధితుని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌తో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పరిశీలించింది. రాష్ట్ర ప్రభు త్వం తరఫున అన్ని శాఖల వారీగా పూర్తి వరద నష్టాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక మంత్రి నారాయణలతో మంత్రి ఫరూక్ సమావేశమయ్యారు. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి, క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యలపై చర్చించారు.