- వర్కర్ నుంచి వ్యవస్థను శాసించే స్థాయికి..
- రైసు, ఇసుక, టీడీఆర్ బాండ్లు.. సర్వం దోపిడీ
- మండలానికో వైసీపీ బ్రోకర్‌తో భారీగా వసూళ్లు
- తణుకు సెగ్మెంట్లో అంతులేని దందాలు
- పొరుగు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తులు
(చ్కెతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఓ రైస్ మిల్ వర్కర్.. ఆ పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగే హీరో క్యారెక్టర్ని తెలుగు దర్శకులు తీసే కల్పిత సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ ఆంధ్ర స్క్రీన్ మీద సీఎం జగన్ ఆడిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ మూవీలో హీరోలను తలదన్నే విలన్ క్యారెక్టర్లను లైవ్‌లో చూడొచ్చు. అలాంటి మందలో మహా ముదురు `మంత్రి కారుమూరి. నా దారి.. చీకటి దారి.. అడ్డు రావొద్దు అంటున్నాడు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. అధికా రాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు ఎలా దోచేయాలో యావత్ ప్రపంచానికి కేస్‌స్టడీగా నిలచిన జగన్‌రెడ్డి ఇతగాడికి ఆదర్శం. నియోజకవర్గంలో మట్టి, ఇసుక నుంచి టీడీఆర్ బాండ్ల కుంభకోణం వరకు.. 1400 కోట్ల రూపాయలు దిగమింగి చరిత్ర సృష్టించిన చీకటి ఘనాపాటి. అధికారం ఉండగానే దోపిడీ చక్క బెట్టు కోవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన కారుమూరి… భూము లు, మద్యం, ఇసుక, బియ్యం.. ఇలా దేన్నీ వదల కుండా దోపిడీపర్వాన్ని కొనసాగించాడు. తణుకు నియోజకవర్గంలో కారుమూరి ఆగడాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. అధి కార బలంతో ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెద్ద ఎత్తున వనరులకు కొల్లగొడుతున్నాడు. వైసీపీలోనే గత మంత్రివర్గంలో పని చేసిన ఒక బడానేత వద్ద పూర్వాశ్రమంలో వర్కర్‌గా పనిచేసిన కారుమూరి అను భవానికి అధికారం తోడైంది. ఇంకేముంది నియోజక వర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం రైస్ మిల్లర్లను సిండి కేట్‌గా మార్చి రైతులను అడ్డంగా దోచుకుంటున్నాడు. మరోవైపు రేషన్ బియ్యాన్ని అక్రమంగా మిల్లులకు తరలించి అక్కడి నుంచి పాలిష్ చేయించి ఇతర రాష్ట్రా లకు, విదేశాలకు తరలిస్తూ రూ. 7వేల కోట్ల బియ్యం కుంభకోణంలో కారుమూరి కీలకపాత్ర పోషిస్తున్నాడు.
టీడీఆర్ బాండ్ల కుంభకోణం
ఉభయ తెలుగురాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని విధంగా టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణానికి కారు మూరి తెరలేపాడు. ఒక్క తణుకు మున్సిపాలిటీలోనే సుమారు రూ.700 కోట్లమేర టీడీఆర్ బాండ్ల కుంభ కోణం జరిగిందంటే కారుమూరి చేతివాటం ఎంత చాకచక్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై జగన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఈయన చేసిన పాపానికి తణుకులో ఒక మున్సిపల్ కమిషనర్ సైతం బలయ్యాడు.
బ్రోకర్లతో కారుమూరి దోపిడీ పర్వం
తనచేతికి మట్టి అంటకుండా మండలానికొక వైసీపీ నేతను బ్రోకర్‌గా నియమించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నియోజకవర్గాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నాడు.
పోలేపల్లి వెంకటప్రసాద్ ఉరఫ్ పీబీఆర్: తెలంగా ణలో కారుమూరి ఆస్తులు, పరిశ్రమల పర్యవేక్షకుడు.
బోడపాటి నరేంద్ర: సెటిల్‌మెంట్లు, భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి కారుమూరికి అప్పజెప్పే నమ్మకమైన నీడ.
శ్రీమన్నారాయణ: కారుమూరికి పీఏగా చెలామణి అవుతూ ప్రతి దందాను మొదలు పెట్టేది ఇతగాడు. మంత్రి దగ్గరకు ఎవరొచ్చినా ధర నిర్ణయించడం, వసూలు చేయడం ఇతని బాధ్యత.
మల్లిరెడ్డి నాగార్జున: ఇసుక నుంచి డబ్బులు వసూ లు చేసే బాధ్యత ఇతనిదే. తణుకులోకి ఇసుక లారీ వచ్చిందంటే రూ.5వేల నుంచి రూ.10వేలు వసూలు చేస్తారు.
కావలవరపు రాజ్‌కోటి: కారుమూరి నాగేశ్వరరావు కు డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ పోలీ సుల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యుడు.
వల్ల సందీప్: ఇతడి పని మంత్రి బ్లాక్ మనీని కంపె నీలలో పెట్టడం, మనీలాండరింగ్ లావాదేవీలు నిర్వహించడం.
ఇసుకనుంచి సున్నపురాయి వరకు…!
అడ్డగోలు దోపిడీకి ఇసుక నుంచి మట్టి, సున్నం వరకు దేనినీ కారుమూరి వదల్లేదు. ఇసుక దందాలో మాత్రం మిగతా మంత్రులకంటే ముందున్నాడు. నియో జకవర్గంలోని పెండ్యాల, కూసన్నమర్రు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి రోజుకు వేలాది లారీలను అక్ర మంగా తరలిస్తూ వందల కోట్లు ఆర్జించాడు. కరోనా సమయంలో ఇసుక లెక్కల్లో తేడాలస్తే…పంది కొక్కులు తినడం వల్లే ఇసుక మాయమైందంటూ కొత్త సందేశమి చ్చిన ఘనుడు. ద్వారకా తిరుమల వద్ద 10 ఎకరాల పైన సున్నపు రాయి గనులను ఆక్రమించుకుని నెలకు రూ.2కోట్ల చొప్పున ఆర్జిస్తున్నాడు. ఒక్క గోపాలపురం లోనే 3చోట్ల మైనింగ్ నిర్వహిస్తూ రూ.10 కోట్ల మేర నెలకు వసూలు చేసి బెంగుళూరుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపిస్తున్నాడు.
భూబకాసురుడు కారుమూరి
తణుకు నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపించిం దంటే సాయంత్రంకల్లా మంత్రి అనుచరులు వాలి పోతారు. వందలాది ఎకరాల భూములను కబ్జాచేశా రు. తణుకు నియోజకవర్గంలో రైతు ప్రయోజనాల కోసం పూర్వీకులు తవ్వించిన చెరువును సైతం మింగే శారు. అత్తిలిలో 30ఎకరాలు, తణుకులో 12ఎకరాలు, ఇరగవరంలో 38 ఎకరాలు మొత్తం 150 ఎకరాలు.. మూడున్నరేళ్లలో కబ్జా చేశారు. ఇవే కాకుండా జి.చోడ వరంలో 30ఎకరాలు నాగేశ్వరరావు పేరు మీద, 28 ఎకరాలు ఆయన సతీమణి పేరుమీద, కుమారుడి సునీల్ పేరుమీద 18ఎకరాలు ఉన్నాయి. నిజాం పార్కు లోని సర్వే నెం.11/3లో 10ఎకరాలు, ప్రకాశం జిల్లా లోని చీరాలలో 8 ఎకరాలు కారుమూరి కుటుంబం పేరిట ఉంది. రాజమండ్రి విమానాశ్రయం సమీపం లోని బూరుగుపూడి వద్ద 12ఎకరాల భూమిని అధికా రంలోకి రాగానే కుటుంబసభ్యుల పేరు మీద రాయిం చుకున్నారు. రాజమండ్రి బస్టాండ్ సమీపంలో 2 కమ ర్షియల్ అపార్ట్‌మెంట్లూ కొనుగోలు చేశారు. తణుకు పట్టణంలో రంగారావు అనే పెద్దమనిషికి చెందిన 3 వేల గజాలను అక్రమంగా చేజిక్కించుకున్నాడు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వారిని బెదిరించి లాక్కున్నా డు. ఇలాంటి భూదందాలు 20కి పైగా జరిగాయి.
తెలంగాణాలో ఆస్తులు
ఒకప్పుడు హైదరాబాద్‌వస్తే రూ.100 రూమ్‌లో అద్దెకుండే కారుమూరి, నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల కోట్లతో పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదిగాడు. షాద్‌నగర్ సమీపంలో స్టీల్ పరిశ్రమ పెట్టాడు. దీనికోసం రూ.70 కోట్లు వెచ్చించినట్లు సమా చారం. శంషాబాద్ దగ్గర మరో రూ.80కోట్లతో ఇంకో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. ఇవికాకుండా హైదరా బాద్ నగరం నడిబొడ్డున 6 నివాస స్థలాలతోపాటు 2 విల్లాలను కొనుగోలు చేశాడు.
బెంగుళూరులోనూ భూములు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరులోనూ పెద్ద ఎత్తున భూములు, విల్లాలు కొనుగోలు చేశాడు. బెంగుళూరులో కూతురి పేరుతో 10 ఎకరాలు, అల్లుడి పేరుతో 8 ఎకరాలు, 3 విల్లాలు, 1 కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి బెంగుళూరు కు నెలకో సూట్‌కేసు పంపించడం ఠంచనుగా జరుగు తోంది. అల్లుడు దిలీప్‌కుమార్ అంటే మంత్రి కారు మూరికి ఆరో ప్రాణం. అతన్ని పార్టీ మార్చి మరీ ఎమ్మెల్యే చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కర్నాటక నుంచి ఎవరొచ్చినా ఖాళీగా తిరిగే అల్లుడి గురించే గొప్పలు చెబుతూ ఉంటాడు. అతని కోసమే పెద్దఎత్తున బెంగుళూరులో ఆస్తులు కూడబెడుతున్నా డని సమాచారం. ఇలా కారుమూరి అవినీతి చరిత్ర చెప్పుకుంటూపోతే మహా గ్రంథమవుతుంది.