- నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ తొలగింపు
- ముగ్గురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
- ఫిర్యాదుల పరిష్కారానికి కార్యాచరణకు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ఇటీవల నూజివీడులో కలుషితాహారం తిని పెద్దఎత్తున విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనను రాష్ట్ర విద్య, ఐటీి శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భరోసా కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యాశాఖ ఇన్చార్జ్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఏలూరు కలెక్టర్ కె.వెట్రి సెల్వి సభ్యులుగా ఉంటారు.
పర్యవేక్షణ కమిటీ తీసుకునే చర్యలు
విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత నిర్వహణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ పాటిస్తుంది. పారిశుధ్యం, మెస్ పరిశుభ్రత నిర్వహణ, నాణ్యతా ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకుంటుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న మరమ్మతులు చేస్తారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారాని కి అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి వేగంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటా రు. ప్రతి డిపార్ట్మెంట్ స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డ్రగ్ ఫ్రీ, పొగాకు రహిత సంస్థల కోసం కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. ప్రతి విద్యార్థి విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన నైపుణ్యానికి కాలేజ్ వెల్నెస్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ లేదా తత్సమానం, ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు (స్త్రీ ప్రాధాన్యం), ప్రతి విభాగం నుంచి విద్యార్థి మానిటర్లు, తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు ఉంటారు. సంస్థ యొక్క ప్రధాన పర్యవేక్షకు లు, కౌన్సెలర్లు / మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో హాని కలిగించే విద్యార్థుల చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి డేగకన్నేసి ఉంచుతారు.
కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
ఆహార నాణ్యత, చిన్నచిన్న మరమ్మతులు, కొన్ని సున్నితమైన అంశాలు, వైద్య పర్యవేక్ష ణపై ఫిర్యాదులు వంటి సమస్యల తక్షణ పరిష్కారానికి నిర్ణీత సమయంతో కూడిన కార్యా చరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ కమిటీకి సూచించా రు. ఏవైనా అవాంచనీయ ఘటనలు జరిగితే వెంటనే కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు.