- త్వరలోనే మరో రూ.400 కోట్లు ఇస్తామని హామీ
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం, విద్యార్ధులకు అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.600 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరో రూ.400 కోట్లు అతి త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో రూ.788 కోట్లు చెల్లించగా, రెండవ విడతగా రూ.600 కోట్లు చెల్లించింది. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా, గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, రూ.1388 కోట్లు విడుదల చేసారు. త్వరలోనే మరో విడతలో రూ.400 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన బకాయిలన్నీ దశలవారీగా చెల్లిస్తామని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇంతకు ముందే తెలిపింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్త్తిడి తేవద్దని, ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేసింది.