గన్నవరం (చైతన్య రథం): హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయస్వామిని రాష్ట్ర విద్య ఐటీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించడానికి ముందు లోకేష్ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రి లోకేష్ ఆలయానికి వచ్చిన సమయంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.