విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ 83వ ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలనుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.














