అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.00 గంటలకు ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకుంటారు. 10.00 %- 10.45 -పూర్తిగా పునర్ నిర్మించిన 108 ఏళ్ల హైస్కూల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 గంటలకు కాళ్ల మండలం పెద అమిరం గ్రామానికి చేరుకుని దివంగత రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.45 గంటలకు భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోని ఎస్‌ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్యం 12.40 గంటలకు పెద అమిరంలోని జువ్వలపాలెం రోడ్డులో డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు నివాసాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలతో సమావేశం అవుతారు. 2.45 గంటలకు భీమవరంలోని నరసయ్య అగ్రహారం, కుముదవల్లి రోడ్డులోని రఘుకుల టవర్స్‌లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసానికి వెళతారు. సాయంత్రం 4.30 గంటలకు అక్కడి నుండి బయలుదేరి 6.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.