- మరో 8 ట్రక్కుల్లో వాటర్ బాటిల్స్, యాపిల్స్, అరటిపళ్లు, బిస్కెట్లు, బ్రెడ్
విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారీ సంఖ్యలో ఆహార పొట్లాలు సిద్ధం చేయించారు. వరద ముంపు వల్ల నష్టపోయిన బాధితులకు మీకు అండగా మేమున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, మంత్రి నారా లోకేష్ సూచనలతో బాధితులైన వారికి ఆహారం అందజేస్తున్న క్రమంలో మంత్రి రాంప్రసాద్ బుధవారం లక్ష ఆహార పొట్లాలు సిద్ధం చేయించి ముంపు ప్రాంతాలకు పంపించారు. జక్కంపూడికి 35,000, సింగ్‌నగర్ కి 50,000, విజయవాడ వెస్ట్ ప్రాంతానికి 15,000, గన్నవరం ప్రాంతానికి 5000 ఆహార పొట్లాలు పంపించారు. ముంపు ప్రాంతాలలో ఎక్కడా ఆహారం కొరత లేకుండా పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు స్వయంగా పౌష్టికాహారాన్ని తయారు చేయించి దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా రెండు ట్రక్కుల నిండా లక్ష మంచి నీటి వాటర్ బాటిల్స్, రెండు ట్రక్కుల నిండా ప్యాకింగ్ చేసిన 2 లక్షల యాపిల్స్, రెండు ట్రక్కుల నిండా అరటిపళ్ళు, రెండు ట్రక్కుల నిండా బిస్కెట్లు, బ్రెడ్ వంటి పౌష్టికాహారాన్ని పంపించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆహారం తీసుకెళ్లే వాహనాలకు జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.