- సజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారు
- మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసింది
- చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త రాజేష్‌నాయుడు ఆరోపణ
చిలకలూరిపేట: మంత్రి విడదల రజని తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త మల్లెల రాజేశ్ నాయుడు ఆరోపించారు. మంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకున్నారని రాజేశ్ వెల్లడిరచారు. ఈ విషయం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే కేవలం రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారన్నారు. మిగతా డబ్బులు అడిగితే, ‘‘వదిలేయండయ్యా’’ అని సజ్జల చెప్పారని వివరించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేశారని రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో బయటికి వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని రాజేశ్ అధిష్ఠానానికి హెచ్చరికలు చేశారు. కాగా రాజేష్‌నాయుడు మంగళవారం ఉదయం ఈ ఆరోపణలు చేయగా, సాయంత్రానికే చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా అయనను మార్చేయటం గమనార్హం.