విజయవాడ(చైతన్యరథం): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం ఉదయం నుంచీ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, పునరావాస శిబిరాలలో బాధితులను పరామర్శించారు. వరద ప్రవాహంలోనే ముందుకు సాగుతూ బాధితులకు ఆహారం, వస్త్రాలు పంపిణీ చేశారు. వరద బాధితులకు ఆశ్రయం కల్పించిన కమ్యూనిటీ కేంద్రాలలో బాధితులకు దుస్తులు ( చీర, దుప్పటి, పంచి) అందజేశారు. ముంపునకు గురైన 300 మంది భవానిపురం ముస్లిం యువతకు పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు అందజేశారు. 18,19,20 డివిజన్లలో వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న పశువులకు దాణా ఏర్పాటు చేశారు.