• కోవూరు నియోజకవర్గం కొడవలూరు మిదానీ ఫ్యాక్టరీ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• టీడీపీ ప్రభుత్వ హయాంలో మా మండలంలో గమేషా ఫ్యాక్టరీని స్థాపించారు.
• 4వేల మంది ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు.
• ఈ కంపెనీకి కొంత దూరంలో మిధానీ ఫ్యాక్టరీని స్థాపించేందుకు అన్ని అనుమతులు వచ్చాయి.
• కంపెనీని కట్టడం మొదలుపెట్టే దశలో స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కట్టలేక ఫ్యాక్టరీని ఎత్తేశారు.
• మండలంలో 6వేల మంది యువత ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులకు వెళుతున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు కట్టించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జె-ట్యాక్స్ కట్టలేక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి.
• తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకోవడానికి లక్షలాదిమంది యువత భవితను ఫణంగా పెడుతున్నారు.
• గత నాలుగేళ్లలో అమర్ రాజా, ఫాక్స్ కాన్, జాకీ, ఎపిపి పేపర్ మిల్స్ వంటి ఎన్నో పరిశ్రమలు పరారయ్యాయి.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో 40వేల పరిశ్రమలు ఏర్పాటై, 6లక్షలమందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు జగన్ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
• టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి 20లక్షల ఉద్యోగాలిస్తాం.
• పారిశ్రామికవేత్తలకు జె-ట్యాక్స్ బెడద లేకుండా సులభతర లైసెన్సింగ్ విధానాన్ని అమలుచేస్తాం.