అమరావతి (చైతన్యరథం): అమెరికా పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ వారధిగా నిలుస్తున్నారు. అమెరికా పారిశ్రామిక వేత్తలతో ఉన్న సంబంధాలతో వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలుపుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అమెరికా పారిశ్రామిక వేత్తలైన విమల్ కుమార్ కొలప్ప, శ్రీ సాయి కిరణ్ కొలవెన్ను లను సీఎం చంద్రబాబుకు పరిచయం చేశారు. రాష్ట్రానికి ఎన్నారై పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు, రాష్ట్రంలో ఆగ్రో ఫామ్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.