కుప్పం మండలం పలార్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పీఎస్ మునిరత్నం, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పలార్లపల్లెలోని జగన్ ఇంటికి వెళ్లారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాధితులకు తాము, టీడీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్కు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలిపి, ఫిర్యాదు చేశారు. ఆపైన బాధితుడి ఇంటిని సీఐ పరిశీలించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.