- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ భేటీ
- రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపైనా నివేదిక సమర్పణ
- ఉదారంగా నిధులివ్వాలంటూ ప్రధానికి వినతి
- కేంద్రం పరిధిలో చేయదగిన సాయం చేస్తామన్న మోదీ
- ఏపీకి ఇతోధిక సాయంపై కేంద్రం భరోసా
- బాబును అధికారిక నివాసంలో కలిసిన రైల్వేమంత్రి
- విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపట్ల సీఎం ధన్యవాదాలు
- డిసెంబరులో శంకుస్థాపనకు అవకాశముందున్న సీఎం
- నేడు నలుగురు కేంద్రమంత్రులతో విడివిడిగా భేటీలు
ఢల్లీి: రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢల్లీి చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
దాదాపు గంటపాటు ప్రధాని, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా సమావేశ వివరాలను ట్వీట్ చేస్తూ.. ‘సానుకూల వాతావరణంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం జరగడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపట్ల మోదీకి కృతజ్ఞతలు. ఏపీ అభివృద్ధి కార్యక్రమాల అంచనాలనూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. కేంద్రం పరిధిలో చేయదగినంత సాయం చేస్తామని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మోదీ హామీ ఇవ్వడం శుభపరిణామం. ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రంనుంచి భరోసా లభించడం, రాజధాని అమరావతికి కేంద్రం మద్దతు తెలపడం ఆనందదాయకం’ అని పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అనంతరం అధికారిక నివాసానికి చేరుకున్న చంద్రబాబును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అక్కడికే వచ్చి కలిశారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వేజోన్ అంశాలపై ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి మధ్య సుదీర్ఘ చర్చలు సాగాయి. సమావేశం అనంతరం రైల్వే మంత్రితో సాగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా మరో ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ‘దీర్ఘకాలంగా పెండిరగ్‌లోవున్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు హామీని ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్‌కు ధన్యవాదాలు. డిసెంబరు నాటికి కొత్త జోన్‌కు శంకుస్థాపన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రైల్వే రూ.73,743 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లలో ఏపీలోని హౌరా- చెన్నై నాలుగులేన్ల స్ట్రెచ్, 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరిన్ని లోకల్ రైళ్లను పరిచయం చేయడం వంటివి ఉన్నాయి. ఏపీలో లాజిస్టికల్ Ê కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేలతో భాగస్వామ్యం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది’ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, మంగళవారం ఉదయం 11.30కు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు. తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11.15 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. కేంద్రంనుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కేంద్రమంత్రులతో చర్చిస్తారని ముఖ్యమంత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.