- నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి
- తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం
- అచ్చ తెలుగుతో రామాయణం రచించి ధీర వనిత
- బాలికలు ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలి
- గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
- తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కాంస్య విగ్రహం
- హాజరైన మైసూరు మహారాజా చామరాజ వడియార్
విజయవాడ(చైతన్యరథం): తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత్రి అని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతటి కవయిత్రి కాంస్య విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడం అభి నందనయమని కొనియాడారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మొల్ల కాంస్య విగ్రహాన్ని మైసూర్ మహారాజా, ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రంలో ఏపీ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు. తెలుగుజాతికి విలువైన రత్నం మొల్ల అని ప్రశంసించారు. నన్నయ్య ఆదికవి అయితే ఆది కవయిత్రి మొల్ల అని కీర్తించారు. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రి మొల్లకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రామాయణాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అనువదించిన మహా కవయిత్రి మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. తెలుగును భావితరాలకు అందించాలని, ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడ్డాయంటే దానికి కారణం రామాయణం ఒక్కటేనని పేర్కొన్నారు. చేతి వృత్తులు, కులవృత్తులను కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. మహా కవయిత్రి మొల్ల మన తెలుగు రచయిత కావడం మన అదృష్టమన్నారు.
రాజ ఆస్థానం అండ లేకుండా రామాయణం రచించిన ధీర వనిత
మైసూర్ మహరాజా, ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల నుంచి కన్నడ, ఆంధ్ర రాష్ట్రాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశా రు. తెలుగు కవయిత్రి మొల్ల ఒక ధీరవనిత అని కొనియాడారు. నాటి కాలంలో రాజ ఆస్థానాల అండ లేకుండా ఒక కావ్యం రాయలేరని, కాని మొల్ల ఏ రాజాస్థానం అండ లేకుండా అచ్చ తెలుగులో రామాయణం రచించి ఆ శ్రీరాముడికే అంకితమిచ్చారని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య మంచి మైత్రి కొనసాగుతుందన్నారు. మైసూర్ ఆస్థానంలో ఎందరో తెలుగు వారు వివిధ పదవులు అలంకరించారు..మోక్షగుండం విశ్వశ్వరయ్య తెలుగు సంతతి వాడని ఆయన గురించి తెలియని భారతీయుడు ఉండరని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన సంఘ అభివృద్ధికి ఐలాపురం వెంకయ్య విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. సభలో ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, కె.ఎస్.లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, గద్దే రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కమ్మరి శాలివాహన సంఘ ప్రముఖులు ప్రసం గించారు. అనంతరం నిర్వాహకులు మంత్రి కొల్లు రవీంద్ర, అతిథులను ఘనంగా సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో సాహితీప్రియులు పాల్గొన్నారు.