• గూడూరు నియోజకవర్గం మోమిడి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలోని సర్వే నంబర్ 451లో భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం.
• ఈ సర్వే నంబర్ ను ఆనుకుని 7కిలోమీటర్ల మేర సోన ద్వారా 350 ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది.
• సర్వే నంబర్ 451లోనే గిరిజనుల శ్మశానం కూడా ఉంది.
• ఈ భూమికి డీకేటీ పట్టాలు కూడా ఉన్నాయి, ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదయ్యాయి.
• కానీ ఈ భూములను కాజేయడానికి కేపీఆర్ మైన్స్ అండ్ మినరల్స్ వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు.
• మైనింగ్ యజమానులతో స్థానిక వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారు.
• అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోతోంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చట్టాలకు విలువలేకుండా పోయింది.
• పేదల భూములను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం నిత్యకృత్యంగా మారింది.
• దీర్ఘకాలంగా ఎస్సీ, ఎస్టీ, బిసిలు సాగుచేసుకుంటున్న భూములను ఆక్రమంగా కబ్జా చేయాలని చూడటం దారుణం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక సర్వే నంబర్ 451లోని భూములను పేదలకే దక్కేలా చూస్తాం
• పేదల భూములు లాక్కోవాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.