అమరావతి : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ జిల్లాలో తాను నిర్వహించిన సమీక్షా సమావేశాల నివేదికను అందజేశారు. ఆయన వెంట తనయుడు కేశినేని వెంకట్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానూరు వరకు రాబోయే ఫ్లైఓవర్‌కు సంబంధించి సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు కిడ్నీ బాధితుల సమస్య, ఆ ప్రాంతంలో నీటి సమస్యను వివరించారు. కిడ్నీ బాధితులను ఆదు కోవాలని కోరారు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వంలో 30 రోజుల్లోనే రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి బాటలు వేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కేశినేని వెంకట్ పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు అందుకున్నారు.