- దారపునేని నరేంద్రపై.. సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్
- జగన్‌రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా సిఐడి చీఫ్ వికృతచేష్టలు
- గుంజీలు తీయించి.. మోకాళ్లపై నిలబెట్టి.. రాత్రంతా చిత్రహింసలు
- ముసుగులు ధరించి దండుపాళ్యం బ్యాచ్‌ను తలపించిన సునీల్ టీమ్
- తెలుగుదేశం పార్టీ సీరియస్… న్యాయపరమైన చర్యలకు సమాయత్తం
గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తొత్తుగా మారిన సిఐడి చీఫ్ సునీల్ కుమార్ సాధారణ కానిస్టేబుల్ కంటే హీనస్థితికి దిగజారారు. ముఖ్యమంత్రి కళ్లలో ఆనందం చూసేందుకు గతంలో ఎన్నడూ ఏ పోలీసు అధికారి చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తోపాటు మరో నలుగురు సిఐడి పోలీసులు ముసుగులు ధరించి నరేంద్రను తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. అర్థరాత్రి నుంచి ఉదయం 5గంటలకు వరకు నరేంద్రను చిత్రహింసలకు చేశారు. దెబ్బలు బయటకు కనిపించకుండా కొట్టారని దారపనేని నరేంద్ర కన్నీళ్ల పర్యంతమయ్యారు. నరేంద్రను గుంజీలు తీయించి ఒంటికాలితో నడిపించి సిఐడి చీఫ్ సునీల్ రాక్షసానందాన్ని పొందారు. గతంలో ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో కూడా సునీల్ కుమార్ ఇదేవిధంగా వ్యవహరించారు. ఈ విషయం సుప్రీంకోర్టువరకు వెళ్లి మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితులు నెలకొనడంతో ఈసారి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రూటు మార్చారు. నరేంద్రను పైకి కనపడని విధంగా కముకుదెబ్బలతో చిత్రహింసలకు గురిచేశారు. తెలుగుదేశం పార్టీ నేతలే టార్గెట్ గా భౌతిక దాడులకు పాల్పడుతున్న సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో సహా ఇందులో పాలుపంచుకున్న పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది.