• కొండపి నియోజకవర్గం మూలెవారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో అత్యధికులు టిడిపి సానుభూతిపరులన్న కక్షతో అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారు.
• మా గ్రామంలో రోడ్డు పనులు సగంలో నిలిపేశారు.
• ఇళ్ల స్థలాలు ఇచ్చిన సమయంలో మాకు స్థలాలు ఇవ్వలేదు.
• మా గ్రామంలో 60 కుటుంబాలున్నాయి, నీటి సదుపాయం లేదు.
• మా గ్రామం పక్కన వాగు ఉంది. దీనిపై చెక్ డ్యామ్ నిర్మించాలి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్…ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా మార్చేశారు.
• సెంటుపట్టా పేరుతో 7వేల కోట్లు దోచుకున్న జగన్ అండ్ కో తమ వారికి మాత్రమే పట్టాలు ఇచ్చుకున్నారు.
• సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం చూడమని ముఖ్యమంత్రి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూలెవారిపాలెంలో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం.
• ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 నీరు సరఫరా అయ్యేలా చూస్తాం.
• గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేస్తాం.