• వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• గ్రామంలో 400 కుటుంబాలున్నాయి…తీవ్రమైన నీటిఎద్దడి ఉంది.
• ఫ్లోరైడ్ సమస్యతో నడుముల నొప్పులు, గారపళ్లు, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాం.
• ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, ప్రతి ఇంటికీ కుళాయి సదుపాయం కల్పించాలి.
• రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో ప్రజలకు గుక్కెడు నీళ్లందించడం చేతగాని ముఖ్యమంత్రి లక్షలకోట్లతో సంక్షేమం చేశానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు.
• గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది.
• జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్చమైన మంచినీరు అందిస్తాం.
• వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.