- దేశాన్ని ప్రపంచ సాంస్కృతిక పర్యాటకానికి కేంద్రంగా మారుస్తాం
- మ్యూజిక్ టూరిజం కోసం ప్రత్యేక టెంప్లేట్‌ను రూపొందిస్తున్నాం
- కృష్ణవేణి సంగీత నీరాజనంతో తెలుగు సంస్కృతికి పూర్వవైభవం
- కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖల సహాయమంత్రి సురేష్‌గోపి
- అట్టహాసంగా కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రారంభోత్సవం
- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
విజయవాడ(చైతన్యరథం): కర్ణాటక సంగీతంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాల ను, తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే ఉత్సవం కృష్ణవేణి సంగీత నీరాజనమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్‌గోపి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని శుక్రవారం సురేష్ గోపి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఆయన అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కృష్ణవేణి సంగీత నీరాజనం 2వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జీవం పోయడంలో కృషిచేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర పర్యాటక శాఖ, అంకితభావంతో పనిచేసిన నిర్వాహకులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కొన్ని వారాల క్రితం కర్ణాటక సంగీతంలో మైసూరు సంగీత సుగంధ ఉత్సవంలో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు ఇక్కడ కృష్ణవేణి సంగీత నీరాజనంలో కర్నాటక సంగీతానికి తెలుగు భాష, సాహిత్యం, అన్నమా చార్య, రామదాసు, త్యాగరాజు మరెందరో గొప్ప స్వరకర్తలను స్మరించుకోవడం ఆనం దంగా ఉందని తెలిపారు. కేరళలోని ట్రావెన్‌కోర్ రాయల్టీ యొక్క అమూల్యమైన సహ కారం, ప్రత్యేకించి స్వాతి తిరునాల్, కొన్ని అత్యంత అద్భుతమైన కర్నాటక కృతులను స్వరపరిచారు. కేరళలో ఇలాంటి పండుగకు ఇతివృత్తం కావచ్చునని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రతిధ్వనిస్తోంది
ఇటువంటి కార్యక్రమాలు సంప్రదాయాలకు నివాళులర్పించడం మాత్రమే కాకుండా ప్రాంతాల మధ్య మన సాంస్కృతిక వారసత్వం, పరస్పర అనుసంధానంపై మరింత అవ గాహన పెంచుతాయని పేర్కొన్నారు. కర్ణాటక సంగీత సౌందర్యాన్ని శ్రీకాకుళం, అహో బిలం, మంగళగిరి, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధ్యాత్మిక, వారసత్వ ప్రదేశాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలనే నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మికత, చరిత్రతో నిండిన ఈ వేదికలు కర్ణాటక సంగీతం యొక్క దైవిక కళకు సరైన నేపథ్యాన్ని అందించాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన దేశం యొక్క సాంస్కృతిక ప్రాధాన్యతను సంరక్షించడం, ప్రోత్సహించడంలో సహాయపడతా యన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తం గా భారతదేశ చరిత్ర, సంస్కృతిని మోదీ తన అంతర్జాతీయ పర్యటనలలో పంచుకుంటు న్నారన్నారు. ఇదే సందర్భంలో భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుం ది..నేను ఎక్కడికి వెళ్లినా మన చరిత్ర, సంస్కృతి పట్ల అపారమైన ఉత్సాహం కనిపిస్తుం డటం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
మ్యూజిక్ టూరిజం కోసం ప్రత్యేక టెంప్లేట్
భారతదేశం సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదలను రక్షించడం..ప్రోత్సహించడం ద్వారా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చరిత్ర, సంస్కృతిపై అవగాహనను సుసంపన్నం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడా నికి పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. కర్నాటక సంగీతం, తెలుగు సంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవం కృష్ణవేణి సంగీత నీరాజనం భావనను ప్రేరేపించాయని, ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా పర్యాటక మంత్రిత్వ శాఖ ‘‘మ్యూజిక్ టూరిజం’’ కోసం ఒక మార్గదర్శక టెంప్లేట్‌ను రూపొందిస్తోం దని వెల్లడిరచారు. సంగీతానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షించే శక్తి ఉందని, ఈ పండుగలు మన దేశాన్ని సాంస్కృతిక పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా ఉంచుతాయన్నారు. అవి మన సంగీత సంప్రదాయాలకు, విస్తృత ప్రేక్షకులకు మధ్య వారధిగా పనిచేస్తాయన్నారు.
సంగీత పర్యాటకానికి గొప్ప వేదిక
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సంగీతం, సంస్కృతి, పర్యాటకం, ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శించడం ద్వారా ‘‘సంగీత పర్యాటకాన్ని’’ ప్రోత్సహిస్తోన్న మహత్తర కార్యక్రమంగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని అభివర్ణించారు. కర్ణాటక సంగీతం, సంప్రదాయ హస్తకళలు, వంటకాల వారసత్వానికి గొప్ప వేదికగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిలుస్తుందన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం గొప్ప కార్యక్రమమే కాకుండా అద్భుతమైన పద ప్రయోగం అని అభివర్ణించారు. హిందూస్థాని, కర్ణాటక సంగీతాల మేళవింపే కృష్ణవేణి సంగీత నీరా జనం అని పేర్కొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం ద్వారా సంగీత ప్రపంచానికి పున రంకితం అవుదామన్నారు. సంగీత వాగ్గేయకారులైన త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసుల సంగీత పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలి పారు. పినాకిని, ద్వారం వెంకటస్వామి లాంటి వాగ్గేయకారులను అందించిన ఈ నేలను స్మరించుకుందామన్నారు. ఇప్పటికే కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రారంభోత్సవ కార్యక్ర మాలు శ్రీకాకుళం అరసవిల్లి దేవాలయం, రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం, మంగళగిరి, తిరుపతి, అహోబిలంలో జరిగాయన్నారు. రాష్ట్ర కళా సాంస్కృతిక పూర్వ వైభవం, చారిత్రక, సంగీత వారసత్వ సంపద, పర్యాటకాన్ని పోషించుకోవాలన్నదే కార్యక్రమం ఉద్దేశమన్నారు. భరతనాట్యం, కూచిపూడి, హరికథ, తోలుబొమ్మలాట, జమ్ములాట, సత్యహరిశ్చంద్ర తదితర జానపద కళారూపాలను ప్రేక్షకులు కూడా ఆదరిం చాలన్నారు. కళలకు పరిరక్షిస్తూ పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్య మంత్రి పవన్‌కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవానికి పూర్వవైభవం తెచ్చి నాటక రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక పర్యాటకం, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ పర్యాటకానికి పెద్దపీట వేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భారతదేశంలో ఖ్యాతి పొందిన సుప్రసిద్ధ నటులు, ప్రస్తుత కేం ద్ర పర్యాటక సహాయ మంత్రి సురేష్‌గోపి అని వర్ణించారు.
సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కార్యక్రమాలు
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆర్థిక సలహాదారు జ్ఞానభూషణ్ మాట్లాడుతూ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం మూడురోజుల పాటు జరుగుతుందని తెలిపా రు. మూడురోజుల్లో 35 ప్రదర్శనలు, 140 మంది ప్రతిభావంతులైన కళాకారులు, అనుభవజ్ఞులైన మేస్ట్రోలతో ప్రదర్శనలు, నాగ స్వరం, హరికథ, వోకల్, నామ సంకీర్తన కార్యక్రమాలు ప్రతిరోజూ ఉంటాయన్నారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబిం బించేలా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాలు ప్రతి ధ్వనిస్తాయన్నారు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఏ రాష్టంలో అయితే కళలు విలసి ల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం లో కళలు, సంస్కృతి దేదీప్యమానంగా వెలుగొందుతాయన్నారు. సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ రాష్ట్ర కళలు, సంగీతం, సంస్కృతి, సం ప్రదాయాలను అద్భుతంగా వివరిస్తూ సంగీతం గొప్పదనాన్ని చక్కగా వర్ణించారు. మలయాళంలో కేంద్రమంత్రి సురేష్‌గోపిని పొగడ్తలతో ముంచెత్తారు. తొలుత తుమ్మ లపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆహార, చేనేత, హస్తకళలు ఉత్పత్తులను సురేష్‌గోపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సెక్రటరీ వినయ్‌చంద్, ఎండీ కె.ఆమ్రపాలి, కేంద్ర, రాష్ట్ర టూరిజం అధికారులు పాల్గొన్నారు.