వైనాట్ 175 అంటూ తిరిగి అధికారంలోకి వస్తామని తన పార్టీ శాసనసభ్యులను నమ్మజూపే ప్రయత్నం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొంత కాలంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రజా వ్యతిరేకతను గమ నించి గజగజ వణికిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత పొత్తు ప్రకటించినప్పటినుంచి జగన్‌రెడ్డికి నిద్ర కూడా కరువైంది. ఎన్డీయేని బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుతో మొదటి రౌండ్ చర్చలు జరిపిన తరువాత తనను తాను సింగిల్‌గా వచ్చే సింహంలా చెప్పుకునే జగన్‌రెడ్డికి షాక్ తగిలి మైండ్ బ్లాక్ అయింది. బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపి చంద్రబాబు ఢల్లీి నుంచి తిరిగి వచ్చిన రోజునే జగన్‌రెడ్డి గాబరాగా ఢిల్లీ వెళ్లాడు. ఆయనకు
ఇంత కలవరమెందుకో?
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా ` జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం తథ్యమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా.. ఇండియా టుడే-సి ఓటర్ సర్వే తెదేపా సింగిల్‌గా పోటీ చేసినా 25 లోక్‌సభ సీట్లల్లో 17 గెలుచుకుంటుందని వెల్లడిరచి.. జనసేన ఓటుతో కలిసి ప్రభంజనం సృష్టించే వీలుం దని చెప్పింది. పయనీర్ పొలిటికల్ స్ట్రాటజీస్ అనే మరో సర్వే సంస్థ కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని 29 దళిత శాసనసభ స్థానాల్లో ప్రస్తుత అంచనా ప్రకారం తెదేపా-జనసేన కూటమి 20 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడిరచింది. వీటిలో 2019ఎన్నికల్లో కేవలం ఒక్క కొండపిలోనే విజయం సాధించిన తెదేపా, 20 స్థానాలు గెలిచే పరిస్థితికి ఎదగటం రాష్ట్రంలో తెదేపా-జనసేన పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను
తెలియ జేస్తోంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఈ సానుకూలత ఇంకా తీవ్రతరమై అధికార వైసీపీ తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీల కుల అభిప్రాయం.
ఓటమి భయంతో జగన్ కూటమి అభాండాలు
రాష్ట్రంలో ప్రజల మూడ్ పూర్తిగా రివర్స్ అయిం దని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కనువిప్పు కలగడంతో ఉచ్ఛనీచాలు లేకుండా ఆయన బృందగణం దుష్ప్ర చారానికి దిగజారింది. ఇందులో భాగంగా జగన్‌రెడ్డి అవినీతి మానస పుత్రిక ‘సాక్షి’ సోమవారం నాడు పూర్తి అసత్యాలతో కూడిన ఒక కథనాన్ని వండివార్చింది. ఈ కథనం సారాంశమేమంటే… స్వప్రయోజనాలనే చంద్ర బాబు రాష్ట్ర ప్రయోజనాలుగా ప్రజలను నమ్మజూపే ప్రయత్నం చేస్తారని.. రానున్న ఎన్నికల తరుణంలో అదేబాటలో చంద్రబాబు నడుస్తున్నారని. ఈ దుష్ప్రచా రంలో భాగంగా గతంలో చంద్రబాబు వివిధ పార్టీలతో పెట్టుకున్న పొత్తులు, అందుకు ఆయన చెప్పిన కారణా లను ప్రస్తావించింది ‘సాక్షి’.
దాదాపు అరపేజీ మేరకు వండి వార్చిన ఈ కపట కథనంలో..వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఎన్నికల్లో గెలిచి, తద్వారా సంక్రమించిన అధికారాన్ని స్వప్రయో జనాలకు వాడుకున్న ఒక్క ఉదాహరణ కూడా జగన్ పత్రిక చూపలేకపోయింది. గతంలో బీజేపీతో రెండు సార్లు చంద్రబాబు పొత్తు పెట్టుకుని విడిపోయారని, మరలా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని, అదే విధంగా పవన్ కల్యాణ్‌తోనూ పొత్తు పెట్టుకుని దూర మయ్యా రని,మరలా దగ్గరయ్యారని చెప్పటం మినహా రాజకీయ పొత్తులను సొంతం కోసం వాడుకున్న సందర్భాలేమీ చెప్పలేక, తన కపట కథనంలోని డొల్లతనాన్ని సాక్షి బయట పెట్టుకుంది.
పొత్తుల ద్వారా రాష్ట్రంలోను, కేంద్రంలోను లభిం చిన అధికారాన్ని చంద్రబాబు రాష్ట్ర విస్తృత ప్రయోజ నాల కోసం కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ఏవిధంగా ఉపయోగించుకు న్నది రాష్ట్ర ప్రజలందరికి తెలిసిన సంగతే. పొత్తుల ద్వారా కేంద్రంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల నియామకాల్లో కీలక పాత్ర పోషించి చంద్రబాబు దేశ స్థాయిలో తెలుగు పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు ఎన్నడూ.. కేంద్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్రా లకు అంతటి ప్రాధాన్యం లభించని సంగతి ప్రజలం దరికీ తెలుసు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పొత్తులతో నవ్యాంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో గత ప్రాభవం తిరిగి లభిస్తుందన్న దుగ్ద, కక్షలతో జగన్ మూకలు నీచానికి దిగజారుతున్నారు.
మధ్య నిషేధం
గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో మధ్యపానాన్ని నిషేధించిన తరువాతే మరలా ప్రజలను ఓట్లు అడుగు తానని నమ్మబలికిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తూ పేద ప్రజల జీవి తాలతోటి, ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతున్న సంగతి ని ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. అంతటి నయవంచ కుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యనిషేదాన్ని తొలగించిన సంగతిని జగన్‌రెడ్డి సొంత పత్రిక తప్పుపట్టటం విడ్డూరం కాదా? మద్య నిషేధాన్ని తొలగించటం తప్పైతే..మరి జగన్‌రెడ్డి మద్యనిషేధం హామీని ఎందుకిచ్చినట్లు?
ఈ విధంగా సాక్షి కపట కథనాలలోని అబద్ధాలు, వైరుధ్యాలు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మనసులో నిండు కుపోయిన అభద్రత, అలజడులకు అద్దం పడుతున్నా యని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. తన అవలక్షణాలను ఎదుటివారికి అంటగట్టి.. వాటిని పదే పదే చప్పటం జగన్‌రెడ్డి నైజమని ప్రజలు ఇప్పటికే గమనించారు.రాష్ట్రంలో జగన్‌రెడ్డి సినిమా అయిపోయి ందని ఇకనైనా ముఖ్యమంత్రి, ఆయన భజనగణం గుర్తించి సన్మార్గంలో నడుచుకుంటే మంచిది.
ఉమ్మడి, నవ్యాంధ్రప్రదేశ్‌లకు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు ఆలోచనలు, విధానాలు, వాటి సత్ఫలితాలు, తెలుగు ప్రజల ఉన్నత భవి ష్యత్తు కోసం ఆయన చేసిన నిరంతర శ్రమ ‘నా జీవన లక్ష్యం..రాష్ట్ర హితమే!’ అన్న చందాన చంద్రబాబు తమ సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని ప్రజల కోసం అంకితం చేశారనడానికి అద్దం పడుతోందని రాజకీయ పరిశీల కులు ముక్త కంఠంతో అంటున్నారు.